Afghanistan Blast: అప్గానిస్థాన్ లోని పశ్చిమ ప్రావిన్స్ హెరాత్ లో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 12 మంది మృతి చెందగా.. 25 మంది తీవ్రంగా గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే దీనికి కారణం ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హెరాత్ ప్రావిన్స్ లో జరిగిన పేలుడుకు సంబంధించిన పేలుడు పదార్థాలను అక్కడే ఉన్న క్రీడా మైదానంలో పాతిపెట్టినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పేలుడుకు ఏ తీవ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. ఈ క్రమంలో పేలుడుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ దాడిలో 12 మంది మృతి చెందగా.. అందులో నలుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. 


తాలిబన్ల స్వాధీనం తర్వాత దాడులు
గతేడాది ఆగస్టులో అఫ్గానిస్థాన్ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నారు. అప్పుడు ఆ దేశ ప్రజల్లో చాలా మంది పక్క దేశాలకు వలస వెళ్లారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఆ దేశంలో తరచూ బాంబు దాడులు వంటివి జరుగుతున్నాయి.


జనవరిలోనూ హెరాత్ ప్రావిన్స్ లో ఓ బాంబు దాడి జరిగింది. ఈ పేలుడులో 7 మంది చనిపోగా.. 9 మంది గాయపడ్డారు. ఇప్పుడు దాదాపుగా రెండు నెలల తర్వాత మరోసారి హెరాత్ నగరంలో పేలుడు సంభవించింది.  


Also Read: Sri Lanka Emergency: శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించిన అధ్యక్షుడు గొయబాయ రాజపక్స.. కారణం అదేనా?


Also Read: Will Smith: విల్ స్మిత్‌పై చర్యలు తప్పవా..? ఉత్తర నటుడి అవార్డు కోల్పోనున్నాడా..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook