At least 255 killed in Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారు జామున తూర్పు పక్టికా ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 6.1గా నమోదయ్యింది. ఈ భూకంపం ధాటికి సుమారు 255 మంది చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. భూకంపం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధవారం అఫ్గాన్‌లోని ఖోస్ట్ నగరంలో భూమి భారీ స్థాయిలో కంపించింది. దాంతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. భూకంపం ధాటికి పలు భవనాలు నేలమట్టమయ్యాయి. అర్ధరాత్రి సమయంలోనే పలుమార్లు ప్రకంపనలు చోటుచేసుకోవడంతో.. అనేక మంది శిథిలాల కింద చిక్కుకుని మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. ఇప్పటికే 255 మంది చనిపోయారని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.


భూకంపం సంభవించిన ప్రాంతాల్లో ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటికి తీసేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భూకంప తీవ్రత తీవ్రత 6.1గా నమోదయింది అమెరికా జియోలాజికల్‌ సర్వే (USGS) వెల్లడించింది. ఖోస్ట్‌ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో 51 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే పేర్కొంది.


మరోవైపు పాకిస్థాన్‌లోనూ పలు చోట్ల స్వల్ప భూకంపం సంభవించింది. పెషావర్‌, ఇస్లామాబాద్‌, ఖైబర్‌ పఖ్తుంఖ్వా, లాహోర్‌, పంజాబ్ ప్రావిన్స్‌లలో పలు ప్రాంతాల్లో చిన్నపాటి ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం చోటుచేసుకోలేదని పాకిస్తాన్ అధికారులు తెలిపారు.


Also Read: TS Inter Results 2022 : నేడో రేపో తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్  చెక్ చేసుకోండి ఇలా..!  


Also Read: AP Inter Results 2022: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.