Afghan Earthquake Update: ఆఫ్ఘనిస్తాన్‌లో నిన్న మద్యాహ్నం సంభవించిన భారీ భూకంపం ధాటికి ఆ దేశంలోని హెరాత్ ప్రావిన్స్‌లో విధ్వంసం చోటుచేసుకుంది. భారీగా భవంతులు నేలమట్టం కావడం, కొండ చరియలు విరిగిపడటంతో ప్రాణనష్టం భారీగా ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆఫ్ఘనిస్తాన్ భూకంపంపై ఆ దేశంలోని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి స్పందించారు. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భూకంపం వల్ల దేశంలో 2 వేలకుపైగా ప్రజలు మరణించారని తాలిబన్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రత నమోదైన ఈ భూకంపం గత రెండు దశాబ్దాల్లో అతిపెద్ద విలయంగా పరిగణిస్తున్నారు. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం హెరాత్ ప్రావిన్స్ ప్రాంతంలోనే ఎక్కువగా మరణించారు. చాలామంది శిధిలాల కిందే సమాధయ్యారు. 


శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకూ దాదాపు ఏడుసార్లు భూమి కంపించింది. శనివారం మద్యాహ్నం మాత్రం కేవలం అరగంట వ్యవధిలో ఐదుసార్లు భూమి కంపించింది. అత్యధికంగా 6.3 తీవ్రత నమోదైంది. హెరాత్ ప్రావిన్స్ ప్రాంతంలో ఎక్కువ శాతం పాత ఇళ్లు కావడంతో నేలమట్టమయ్యాయి. భారీ శిధిలాల కింద చిక్కుకుని చాలామంది ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్చలు వేగవంతమయ్యాయి. శిధిలాలు తొలగించేకొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. హెరాత్ పట్టణంతో పాటు సమీపంలోని 12 గ్రామాల్లో భూకంపం ప్రభావం కన్పించింది. గ్రామాల్లో ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. 4వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని తెలుస్తోంది. భూకంపం కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది.



ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు మృతుల సంఖ్య 2 వేలకు పైగా ఉంటుందని తాలిబన్ అధికార ప్రతినిధి తెలిపారు. మరో 5 వేలమంది గాయాలపాలయ్యారు. ఇళ్లు నేలమట్టం కావడంతో వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. మరణాల సంఖ్య మరింత పెరగవచ్చని తెలుస్తోంది. గత ఏడాది తూర్పు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో సంభవించిన భూకంపంలో దాదాపు 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Also read: Israeli Palestinian War Live: జర్మనీ యువతిని నగ్నంగా ఊరేగించిన హమాస్ ఉగ్రవాదులు.. మృతదేహం కోసం తల్లి వేడుకోలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook