Taliban Government: మూడ్రోజుల్లో తాలిబన్ ప్రభుత్వం, మహిళలకూ ప్రాధాన్యత
Taliban Government: ఆఫ్ఘనిస్తాన్‌లో మరో మూడ్రోజుల్లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఆ ప్రభుత్వం ఎలా ఉండనుంది..మహిళల పరిస్థితి ఏంటనేదానిపై తాలిబన్ ముఖ్యనేత ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
Taliban Government: ఆఫ్ఘనిస్తాన్‌లో మరో మూడ్రోజుల్లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఆ ప్రభుత్వం ఎలా ఉండనుంది..మహిళల పరిస్థితి ఏంటనేదానిపై తాలిబన్ ముఖ్యనేత ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)లో మరో మూడ్రోజుల్లోనే కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. తాలిబన్ ప్రభుత్వ విధి విధానాలు, ప్రభుత్వం ఎలా ఉండనుంది, మహిళలకు ప్రాధాన్యత ఉంటుందా లేదా అనే విషయాలపై తాలిబన్ రాజకీయ విభాగం ఉపాధ్యక్షుడు షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్‌జాయ్ కీలక విషయాలు వెల్లడించారు. ఖతార్ నుంచి ఆయన మాట్లాడారు. కొత్తగా ఏర్పడనున్న తాలిబన్ ప్రభుత్వంలో గత 20 ఏళ్లుగా ప్రభుత్వంలో పనిచేసిన వారికి స్థానం లేదని స్టానిక్‌జాయ్ తెలిపారు. ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఏర్పడనుందనడంలో ఏ మాత్రం సందేహం లేదని చెప్పారు. దేశంలోని అన్ని ప్రాంతాలవాళ్లు ప్రభుత్వంలో ఉంటారన్నారు. గత 20 ఏళ్ల కాలంలో ఏరూపంలోనైనా అధికార వ్యవస్థలో పనిచేసినవారికి స్థానం లేదన్నారు. అంతకుముందు తాలిబన్ ప్రభుత్వ(Taliban government)ఏర్పాటుపై మూడ్రోజులుగా జరిగిన సమావేశం ముగిసినట్టు తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వంలో మహిళలకు కూడా ఉంటారని షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్‌జాయ్ తెలిపారు. అయితే మంత్రుల స్థాయిలో ఉంటారా లేదా మరో స్థానంలో ఉంటారా అనేది ఇంకా స్పష్టత లేదు. మహిళలు అధిక సంఖ్యలో ఉంటారనే విషంయలో సందేహం లేదన్నారు. మహిళలు అధికార వ్యవస్థల్లో కూడా పనిచేస్తారని చెప్పారు.
Also read: Talibans Ruling: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లకు రానున్నది గడ్డుకాలమే, ఆ సమస్యే కీలకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook