Joe Biden: ఆఫ్ఘనిస్తాన్‌ను వశపర్చుకున్న తాలిబన్ల విషయంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాలిబన్ల సహకారం కావాలంటున్నారు బిడెన్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా బలగాలు పూర్తిగా ఉపసంహరణకు ఆగస్టు 31 డెడ్‌లైన్ విధించింది తాలిబన్ ప్రభుత్వం(Taliban Government). ముందుగా అనుకున్న ప్రకారం బలగాల్ని డెడ్‌లైన్‌లోగా ఉపసంహరిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తెలిపారు. ఆగస్టు 31 తరువాత ఆ దేశంలో బలగాలుండే ప్రసక్తే లేదన్నారు. అయితే బలగాల ఉపసంహరణకు తాలిబన్ల సహకారం ఉండాలంటూ జో బిడెన్ వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది. 


ప్రస్తుతం కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 5 వేల 8 వందలమంది అమెరికన్ సైనికులున్నారు. బలగాల ఉపసంహరణ కార్యక్రమం కొనసాగుతోంది. తమ దేశ సైనికులు ఎంత త్వరగా దేశానికి వస్తే అంతమంచిదని బిడెన్ అభిప్రాయపడ్డారు.ఎందుకంటే సమయం గడిచే కొద్దీ తమ సైనికులకు ముప్పు పెరుగుతూ ఉంటుందన్నారు. తాలిబన్లు తమ కార్యకలాపాలకు ఎటువంటి అడ్డంకి కల్గించకుండా, విమానాశ్రయాల్లోకి అనుమతిస్తే తరలింపు ప్రక్రియ సజావుగా పూర్తవుతుందన్నారు జో బిడెన్(Joe Biden). గడువుకు ముందే బలగాల ఉపసంహరణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.ఐసిస్‌కు అనుబంధంగా ఆ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐసిస్-కే అమెరికన్ బలగాల్ని టార్గెట్ చేసిందని..ఎప్పుడైనా విమానాశ్రయంపై దాడి చేసే అవకాశాలున్నాయన్నారు.మరోవైపు ఆగస్టు 31 తరువాత కమర్షియల్ విమానాల ద్వారా ఆఫ్గన్‌ల ప్రయాణాలకు అనుమతివ్వాలని తాలిబన్లు(Talibans)అంగీకరించినట్టు తెలుస్తోంది. 


Also read: E-Visa: ఆఫ్గనిస్తాన్ నుంచి రావాలంటే ఈ వీసా తప్పనిసరి, స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook