యెమన్‌లో అమెరికా ఎయిర్ స్ట్రైక్
యెమన్‌లోని అల్‌ఖైదా స్థావరానికి చెందిన వాహనాన్ని అమెరికా డ్రోన్ ఢోకొనడంతో అక్కడిక్కడే అయిదుగురు మిలిటెంట్లు మరణించారు. అమెరికాకి చెందిన పైలెట్ రహిత ఎయిర్ క్రాఫ్ట్ అల్బైదాలోని షర్కాన్ ప్రాంతంలో ఎయిర్ స్ట్రైక్ నిర్వహిస్తున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అల్‌ఖైదా మిలిటెంట్లను టార్గెట్ చేసుకొనే ఈ ఎయిర్ స్ట్రైక్ జరిగిందని పలువురు సెక్యూరిటీ అధికారులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా మిలిటెంట్లను మట్టుబెట్టడానికి అమెరికా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలో తమ స్థావరాలు ఉన్న ఉగ్రవాద ప్రేరేపిత దేశాల్లో తమ ప్రాబల్యాన్ని మరింత పటిష్టం చేయడానికి ప్రయత్నిస్తోంది. యెమన్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న అల్‌ఖైదా గ్రూప్, ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన టెర్రరిస్ట్ నెట్‌వర్క్‌గా పేరుగాంచింది. ఇప్పటికే యెమన్‌లో కొన్ని ప్రాంతాలను ఇది గుప్పిట్లో ఉంచుకొని, ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోంది