America Elections 2024: అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడానికి అవసరమైన 270 ఎలక్టోరల్‌ ఓట్లను  సాధించారు అద్భుత రికార్డును క్రియేట్ చేసారు 78 ఏళ్ల ట్రంప్‌. తాజాగా ఈయన  మెజారిటీ మరింతగా పెరుగుతూ వెళుతోంది. తన గెలుపు తర్వాత అమెరికా స్వర్ణ యుగంలోకి ప్రవేశించిందని విజయం అనంతరం ఆయన వ్యాఖ్యలు చేసారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాపులర్‌ ఓట్లలో హారిస్‌పై…  ట్రంప్‌ దాదాపు 50లక్షలకుపైగా ఓట్ల ఆధిక్యం సాధించారు. సంప్రదాయ రిపబ్లికన్‌ రాష్ట్రాలను నిలబెట్టుకోవడంతోపాటు స్వింగ్‌ రాష్ట్రాలు ఏడింట ట్రంప్‌ హవా సాగింది. ద్రవ్యోల్బణం,అక్రమ చొరబాట్లు, ఉద్యోగాలు, వేతనాలు వంటి అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావాన్ని చూపాయని తెలుస్తోంది. భారత సంతతికి చెందిన కమలా హారిస్‌  ఈ ఎన్నికల్లో ట్రంప్‌తో హోరాహోరీగా తలపడ్డారు. అయినా ఆమె విజయం అందని ద్రాక్ష అనే చెప్పాలి. అభ్యర్థిగా చివరి నిమిషంలో ఖరారు కావడం, ప్రచారంలో వెనుకబడిపోవడం, ఉపాధ్యక్ష అభ్యర్థి విషయంలో పార్టీలో కుమ్ములాటలు ఇలా కర్ణుడి చావకు సవాలక్ష కారణాలు ఆమె ఓటమికి కారణమయ్యాయని  రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


స్వింగ్‌ రాష్ట్రాల్లో రస్ట్‌ బెల్టుగా పిలిచే పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సిన్‌ సంప్రదాయంగా డెమోక్రాట్లకు కంచుకోటలుగా నిలుస్తూ వస్తున్నాయి. ఈసారి వాటినీ ట్రంప్‌ గెలుచుకున్నారు. ఎన్నికలకు ముందు, ఎగ్జిట్‌ పోల్స్‌లో ప్రజాస్వామ్యం, అబార్షన్‌ హక్కు, ఆర్థిక వ్యవస్థ ప్రధానాంశాలని అమెరికన్లు పేర్కొన్నారు. అయితే దానికి భిన్నంగా అధిక ధరలు, వలసలు ఎన్నికల్లో ప్రభావం చూపాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. 20 ఏళ్ల తర్వాత ఎలక్టోరల్‌ ఓట్లతో పాటు పాపులర్‌ ఓట్లలోనూ ఆధిక్యం సాధించిన రిపబ్లికన్‌ అధ్యక్షుడిగా ట్రంప్‌ మరో రికార్డు క్రియేట్ చేశారు. 2004లో జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ రెండింటిలోనూ ఆధిక్యం సాధించారు.  20 యేళ్ల తర్వాత ఆ రికార్డును తిరగరాసారు ట్రంప్.


ట్రంప్‌  మొత్తంగా 50 రాష్ట్రాలలకు గాను 31 రాష్ట్రాల్లో ఆధిక్యం సాధించారు. కాగా ప్రత్యర్ధి కమలా హారిస్‌ 19 రాష్ట్రాల్లో విజయం సాధించారు.కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తున్నట్టు తెలిపారు.  పోరాటాన్ని మాత్రం ఆపేది లేదని కమలా హారిస్‌  తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం ఫలితాలపై ఆమె ఫస్ట్ టైమ్ స్పందించారు. వాషింగ్టన్‌ డీసీలోని హోవర్డ్‌ యూనివర్సిటీ వేదికగా తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు.అయితే.. రెండు సార్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్.. రెండు సార్లు మహిళలపై గెలుపొందటం విశేషం.


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌ కు  ప్రధాని నరేంద్ర మోడీ  ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవనం మెరుగయ్యేందుకు, ప్రపంచ శాంతి, సుస్థిరత, సౌభాగ్యాలకు ఇద్దరం కృషి చేస్తామన్నారు. కాగా ప్రపంచమంతా మిమ్మల్ని ప్రేమిస్తోంది. భారతదేశం ఒక అద్భుతమైన దేశం. మీరో అద్భుతమైన వ్యక్తి. భారతదేశాన్ని ఒక నిజమైన స్నేహితునిగా భావిస్తున్నాను. నేను గెలిచిన తర్వాత నాకు ఫోన్‌ చేసిన ప్రపంచ నాయకుల్లో మోడీయే ముందున్నార్నారు ట్రంప్‌.


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.