అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం వస్తే భారత ఆర్ధిక వ్యవస్థకు నష్టమా..? ఎలా..?
పంతం తగ్గని అమెరికా .. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్ . . మధ్యలో భారత్ నలిగిపోతోంది. అవును ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే .. భారత ఆర్ధిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం కానుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. .
గత కొన్ని నెలలుగా గల్ఫ్ దేశాలలో పరిస్థితి అద్వాన్నంగా మారుతోంది. వరుసగా జరుగుతున్న కొన్ని సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొదట సౌదీ అరేబియాలోని అరాంకో చమురు శుద్ధి కర్మాగారంపై దాడి జరిగింది. ఆ తరువాత ఉత్తర సిరియాపై టర్కీ దాడికి పాల్పడింది. ఇప్పుడు ఇరాన్ ఆల్ ఖుద్స్ ఫోర్స్ కు చెందిన మేజర్ జనరల్ ఖాసిమ్ ను బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అమెరికా డ్రోన్ దాడి ద్వారా హతమార్చింది. దీంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. అగ్రరాజ్యం అమెరికాపై ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఏకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తలకు రివార్డు ప్రకటించింది. ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశం ఉన్నంతగా పరిస్థితులు మారుతున్నాయనే ఆందోళన మొదలైంది.
భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎలా ఉంటుంది?
ప్రపంచంలో చమురు ఉత్పత్తి చేసే దేశాలలో ఇరాన్ ఐదవ అతిపెద్ద దేశం. అమెరికా ఆంక్షలు విధించినప్పటి నుంచి భారత్‌తో సహా అన్ని దేశాలు ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోవడం మానేశాయి. ఐతే ఇరాన్ తో భారత సంబంధాలు కొనసాగుతున్నాయి. కానీ ఒకవేళ యుద్ధం జరిగితే. . భారతదేశ విదేశీ మారకద్రవ్యం బాగా ప్రభావితమవుతుంది. ఈ పరిస్థితుల తరువాత ఆర్థిక మాంద్యం కూడా వచ్చే అవకాశం ఉంది. ఆహారం , పానీయాలు, నిత్యావసరాల ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయి. గల్ఫ్ దేశాలలో భారత ప్రవాసుల వ్యాపారం కూడా ప్రభావితం కావచ్చు. చమురు శుద్ధి కర్మాగారంలో పనిచేసే వారి ఉద్యోగాలు కోల్పోవలసి వస్తుంది.
ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు భారతదేశాన్ని తరచుగా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిని భారత్ ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో బంగ్లాదేశ్ విభజన సమయంలో, తరువాత ఇరాక్ పై అమెరికా దాడి సమయంలో, సిరియా యుద్ధ సమయంలో .. భారతదేశంపై దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఐతే ఈసారి యుద్ధ పరిస్థితులు తలెత్తితే భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది.
[[{"fid":"180948","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ఇండో- అమెరికా సంబంధాలపై ప్రభావం
ప్రస్తుతం ఉన్న పరిస్థితి కారణంగా ఇండో-యుఎస్ సంబంధాలపైనా ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికాతో వాణిజ్యం 100 బిలియన్ డాలర్లు దాటింది. ఒకవేళ యుద్ధం వస్తే సంబంధాలు క్షీణించి వ్యాపార, వాణిజ్యాలపై ప్రభావం పడుతుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..