Eagle Policy: చైనాకు చెక్ పెట్టేందుకు అగ్రరాజ్యం అమెరికా తదితర దేశాలు సిద్ధమవుతున్నాయి. క్వాడ్ దేశాలతో బంధాన్ని మెరుగుపర్చుకునే క్రమంలో ముందడుగు వేసింది. అత్యంత కీలకమైన ఈగిల్ చట్టానికి ఆమోదం తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసేందుకు అమెరికా సిద్ధమైంది. క్వాడ్ దేశాలతో(Quad Countries) బంధాన్ని మెరుగుపర్చుకునే దిశలో అగ్రరాజ్యం ముందడుగేసింది. కీలకమైన ఎన్సూరింగ్ అమెరికన్ గ్లోబల్ లీడర్‌షిప్ అండ్ ఎంగేజ్‌మెంట్ స్థూలంగా చెప్పాలంటే ఈగిల్ చట్టం అమలుకు ద హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ ఆమోదం తెలిపింది. చైనాతో ఎదురయ్యే సవాళ్లకు దీటుగా సమాధానం చెప్పేందుకు ఈ చట్టం ఉపయోగపడనుంది.ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా(America)దౌత్య, నాయకత్వ అంశాల్ని బలోపేతం చేసేందుకు ఈ చట్టం ఉపయోగపడనుంది. ఎక్కడికక్కడ చైనా కుయుక్తుల్ని బయటపెట్టడం, చైనాతో పోటీ పడుతూ వనరుల్ని బలోపేతం చేసుకోవడమే ఈ పాలసీ ముఖ్య ఉద్దేశ్యం.


దీనికోసం అమెరికా(America), భారత్, జపాన్, ఆస్ట్రేలియా కలిసి ఇంట్రాపార్లమెంటరీ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని ఈగిల్ చట్టం(Eagle Law)సూచిస్తోంది. యూఎస్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధుల పరిమితిని 6 వేల కోట్ల డాలర్ల నుంచి 10 వేల కోట్ల డాలర్లకు పెంచాలని సూచించింది. 2017 లో ఏర్పాటు చేసిన క్వాడ్‌కు అమెరికా ఆమోదం తెలపడంతో చైనా(China)ఆధిపత్యానికి ఇక సవాలు ఏర్పడటం ఖాయంగా కన్పిస్తోంది. 


Also read: Corona Third Wave: కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభమైపోయిందంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ, నిజమెంత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook