Corona Third Wave: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వెంటాడుతోంది. కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. కరోనా థర్డ్‌వేవ్ ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైపోయిందా..
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం పట్టినా థర్డ్‌వేవ్(Corona Third Wave) రూపంలో ముప్పు వెంటాడుతోందనే హెచ్చరికలు వివిధ వర్గాల్నించి వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళన కల్గిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభమైపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ హెచ్చరించారు. ఈ హెచ్చరికే ఇప్పుడు ఆందోళనకు కారణమవుతోంది. దురదృష్టవశాత్తూ ప్రపంచం ఇప్పుడు కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభ దశలో ఉందని..ప్రపంచవ్యాప్తంగా 111 దేశాల్లో డెల్టా ప్లస్ వేరియంట్(Delta plus variant)వ్యాప్తి కొనసాగుతోందని తెలిపారు. ఈ వేరియంట్, జన సంచారమే కరోనా థర్డ్‌వేవ్‌కు కారణమవుతోందని చెప్పారు.డెల్టా వేరియంట్ వ్యాప్తిని సామాజిక చైతన్యం, సమర్ధవంతమైన ప్రజారోగ్య చర్యల ద్వారా అడ్డుకోవాలని సూచించారు. కరోనా వైరస్ ఓ వైపు అభివృద్ధి చెందుతూనే ఉందని..వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్ల పుట్టుకొస్తున్నాయని టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆరు ప్రాంతాల్లో వరుసగా నాలుగు వారాల నుంచి కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయన్నారు. వ్యాక్సిన్లు ఒక్కటే కరోనా మహమ్మారిని అడ్డుకోలేవని..కచ్చితమైన విధానంతో ముందుకు వెళ్లాలని సూచించారు. భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, శానిటైజేషన్ వంటి నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని చెప్పారు.
Also read: Joe Biden: జో బిడెన్ ప్రభుత్వంలో ఇద్దరు ఇండో అమెరికన్లకు వరించిన కీలక పదవులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook