Green Card: అమెరికాలో గ్రీన్‌ కార్డుల లబ్ధిదారులకు శుభవార్త అందింది. గ్రీన్‌కార్డులు, శాశ్వత నివాసం కోసం వచ్చిన దరఖాస్తులను ఆరు నెలల్లోపు ప్రాసెస్ చేయాలని అమెరికా అధ్యక్షుడి అడ్వైజరీ కమిషన్‌ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈమేరకు సిఫార్సుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనికి త్వరలో శ్వేత సౌధానికి పంపనున్నారు. ఆసియా అమెరికన్లు, నేటివ్ హవాయిన్స్, పసిఫిక్ ఐలాండర్స్‌పై అడ్వైజరీ కమిషన్‌ నియమించారు.  కమిషన్‌ సిఫార్సులను పచ్చజెండా లభిస్తే గ్రీన్‌ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి ఎంతో మేలు జరగనుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికా అధ్యక్షుడి అడ్వైజరీ కమిషన్‌ మీటింగ్‌లో దరఖాస్తుల ప్రాసెస్ ప్రతిపాదనను ప్రముఖ ఇండో-అమెరికన్ నేత అజేయ్ జైన్ భుటోరియా ప్రస్తావించారు. దీనికి కమిషన్‌లోని 25 మంది సభ్యులు పచ్చజెండా ఊపారు. అమెరికాలో గ్రీన్‌కార్డుల బ్యాక్‌లాగ్‌ పెండింగ్‌ను తగ్గించేందుకు వాటిని మరోసారి సమీక్షించాలని అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌కు కమిషన్ సూచనలు చేసింది. 


ఫ్యామిలీ గ్రీన్‌కార్డ్ అప్లికేషన్లు, డీఏసీఏ రెన్యూవల్స్, ఇతర గ్రీన్‌ అప్లికేషన్ల సమయాన్ని తగ్గించడంపై కీలక ప్రతిపాదనలు చేసింది. మరోవైపు గ్రీన్‌కార్డు ఇంటర్వ్యూలను సైతం వేగవంతం చేయాలని కమిషన్‌ సూచించింది. ఈఏడాది ఆగష్టు నుంచి అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకుని వీటిని పూర్తి చేయాలని తేల్చి చెప్పింది. ప్రస్తుతం 32 వేల 439 ఇంటర్వ్యూలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉందని..వచ్చే ఏడాది నాటికి 150 శాతానికి పెంచాలని తెలిపింది. 


గ్రీన్‌కార్డుల ఇంటర్వ్యూ, వీసా ప్రాసెసింగ్‌కు కాల వ్యవధి ఆరు నెలలు ఉండేలా చూడాలని కమిషన్‌ ప్రతిపాదనలు చేసింది. ఇటు యూఎస్ సిటిజన్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌కు అడ్వైజరీ కమిషన్‌ ప్రతిపాదనలు చేసింది. వర్క్‌ పర్మిట్లు, ట్రావెల్ డాక్యుమెంట్లు ఇతర మార్పులను మూడు నెలల్లో పూర్తి చేయాలని పేర్కొంది. ఏప్రిల్ నాటికి అమెరికాలో 4 లక్షల 21 వేల 358 ఇంటర్వ్యూలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. 


Also read:Puvvada vs Mallanna: తీన్మార్‌ మల్లన్నకు పరువు నష్టం దావా నోటీసులు..ఎవరు ఇచ్చారంటే..!


Also read:IPL 2022 Playoffs Scenario: ముంబైపై ఢిల్లీ గెలిస్తే.. ఆ నాలుగు జట్లు ఔట్! రసవత్తరంగా ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్స్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook