IPL 2022 Playoffs Scenario: ముంబైపై ఢిల్లీ గెలిస్తే.. ఆ నాలుగు జట్లు ఔట్! రసవత్తరంగా ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్స్‌

IPL 2022 Playoffs Chances. మే 21న ముంబైపై ఢిల్లీ భారీ తేడాతో విజయం సాధిస్తే మెరుగైన రన్‌రేట్‌ కారణంగా బెంగళూరుని వెనక్కునెట్టి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 17, 2022, 03:57 PM IST
  • రసవత్తరంగా ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్స్‌
  • గుజరాత్ టైటాన్స్ మాత్రమే
  • ముంబైపై ఢిల్లీ గెలిస్తే.. ఆ నాలుగు జట్లు ఔట్
IPL 2022 Playoffs Scenario: ముంబైపై ఢిల్లీ గెలిస్తే.. ఆ నాలుగు జట్లు ఔట్! రసవత్తరంగా ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్స్‌

IPL 2022 Playoffs Chances, If Delhi beat Mumbai in Final Leauge match RCB Out: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 రసవత్తరంగా సాగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా లీగ్ చివర దశకు వచ్చినా.. ఇప్పటివరకు ప్లే ఆఫ్స్‌ బెర్తులు ఖరారు కాలేదు. ఇప్పటివరకు 13 గేమ్‌లలో 10 విజయాలతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన గుజరాత్ టైటాన్స్ మాత్రమే ప్లే​ ఆఫ్స్‌ బెర్తు కన్ఫర్మ్‌ చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ రెండవ స్థానం కోసం పోటీ పడుతున్నాయి. ఇక చివరిదైన నాలుగో స్థానానికి ఢిల్లీ క్యాపిటల్స్ ఫేవరేట్‌గా ఉండగా.. పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు కోల్‌కతా నైట్ రైడర్‌లు రేసులో ఉన్నాయి. 

సోమవారం (మే 16) పంజాబ్‌ను ఢిల్లీ ఓడించడంతో  ప్లే ఆఫ్స్‌ సమీకరణలు మారిపోయాయి. గుజరాత్‌ ప్లే​ ఆఫ్స్‌ బెర్తు దక్కించుకోగా.. టెక్నికల్‌గా రాజస్థాన్‌ (16), లక్నో (16), ఢిల్లీ (14), బెంగళూరు (14), కోల్‌కతా  (12), పంజాబ్‌ (12), సన్‌రైజర్స్‌ (10) జట్లు రేసులో నిలిచాయి. ఐపీఎల్ 2022లో జట్లన్నీ మరో మ్యాచ్‌ ఆడాల్సి ఉండగా.. సన్‌రైజర్స్‌ మాత్రమే రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే రాజస్థాన్‌ (0.304), లక్నో (0.262) జట్లకు 16 పాయింట్లు ఉండడమే కాకూండా మెరుగైన రన్‌ రేట్‌ కారణంగా సేఫ్‌ సైడ్‌లో ఉన్నాయి. మిగతా ఐదు జట్ల మధ్య రసవత్తరమైన పోటీ నెలకొని ఉంది. ఈ ఐదు జట్ల ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయి.

రాజస్థాన్‌ మిగిలిన ఒక మ్యాచ్ గెలిస్తే.. అధికారికంగా రెండో స్థానంను దక్కించుకుంటుంది. మరోవైపు లక్నో చివరి మ్యాచులో గెలిస్తే.. రెండవ స్థానంకు చేరుకుంటుంది. అయితే మెరుగైన రన్‌ రేట్‌ కూడా అవసరం. ఈ రెండు జట్ల జయాపజయాలపై 2,3 స్థానాలు ఆధారపడి ఉన్నాయి. ఇక ఈరోజు ముంబై చేతిలో సన్‌రైజర్స్‌ ఓడితే.. కేన్ సేన ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అలాకాకుండా ముంబైపై సన్‌రైజర్స్‌ భారీ తేడాతో గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉంటాయి. చివరి మ్యాచ్లో కూడా సన్‌రైజర్స్‌ గెలవాల్సి ఉంటుంది. 

# మే 18న లక్నోపై కోల్‌కతా విజయం సాధిస్తేనే.. ప్లే ఆఫ్స్‌ రేసులో ఉంటుంది. ఒకవేళ ఓడిందా ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. 

# మే 19న గుజరాత్‌పై బెంగళూరు భారీ తేడాతో గెలిస్తే.. 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటుంది. అప్పుడు రన్‌రేట్‌ పరిగణలోకి వస్తుంది. 

# మే 21న ముంబైపై ఢిల్లీ భారీ తేడాతో విజయం సాధిస్తే మెరుగైన రన్‌రేట్‌ కారణంగా బెంగళూరుని వెనక్కునెట్టి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఢిల్లీ గెలిస్తే.. బెంగళూరు మాత్రమే కాకుండా కోల్‌కతా, పంజాబ్‌, సన్‌రైజర్స్‌ టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి. ఒక వేళ ఢిల్లీ ఓడితే బెంగళూరుకు పండగే. 

# ఒకవేల ముంబైపై సన్‌రైజర్స్‌ గెలిచి, లక్నోపై కోల్‌కతా గెలిచి, గుజరాత్‌ చేతిలో బెంగళూరు ఓడి, ముంబై చేతిలో ఢిల్లీ ఓడితే మాత్రం మే 22న జరిగే సన్‌రైజర్స్‌, పంజాబ్‌ మ్యాచ్‌ కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ గెలిస్తే సన్‌రైజర్స్‌ నిష్క్రమిస్తుంది.

Also Read: Janhvi Kapoor Pics: పొట్టి డ్రెస్సులో జాన్వీ కపూర్.. అమ్మడిని ఇలా ఎప్పుడూ చూసుండరు!

Also Read: KGF 2 Collections: కేజీఎఫ్ 2 వసూళ్ల సునామీ... ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లు కొల్లగొట్టిన రాకీభాయ్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News