Joe Biden and Xi jinping: అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా..ఇరు దేశాల అధ్యక్షులు సుదీర్ఘకాలం తరువాత ఏం మాట్లాడుకున్నారనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుదీర్ఘకాలం తరువాత అమెరికా అధ్యక్షుడు జో బిడెన్(Joe Biden), చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మనసు విప్పి మాట్లాడుకున్నారో లేదో తెలియదు కానీ..ఇరువురి మధ్య మాటలు జరిగాయి. జో బిడెన్ స్వయంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. జో బిడెన్ అధ్యక్షుడిగా బాథ్యతలు స్వీకరించాక జిన్‌పింగ్‌తో ఫోన్‌లో మాట్లాడటం ఇది రెండవసారి. ఈ రెండు దేశాల మధ్య వివిధ అంశాల్లో విపరీతమైన పోటీ నడుస్తోంది. గతంలో ఫిబ్రవరి 12వ తేదీన ఈ ఇద్దరూ మాట్లాడుకున్నారు.


రెండు దేశాల మధ్య వ్యూహాత్మక అంశాలపై ఇరువరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. మరోవైపు రెండు దేశాల మధ్య పోటీ వివాదం కాకుండా అమెరికా(America) ఏ చర్యలు తీసుకుంటుందనేది జిన్‌పింగ్ స్పష్టంగా వివరించారు. అటు చైనా బ్రాడ్ కాస్టింగ్ సంస్థ సీసీటీవీ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ..ఇరుపక్షాలు వ్యూహాత్మక అంశాలపై లోతైన చర్చ జరిగినట్టు వెల్లడించింది. ఈ చర్చకు అమెరికా ఆసక్తి చూపించిందని తెలుస్తోంది. యూఎస్ , చైనా అనుసరిస్తున్న విధానం..ద్వైపాక్షిక సంబంధాలలో తీవ్ర ఇబ్బందులకు దారి తీసిందనే చర్చ ప్రస్తావనకొచ్చింది. దాంతో దేశాలలోని ప్రజల ప్రాధమిక ప్రయోజనాలు, ఉమ్మడి ప్రయోజనాలకు విరుద్ధంగా నడిచే అవకాశాలున్నాయని జిన్‌పింగ్(Xi jinping).. జో బిడెన్‌తో చెప్పినట్టు తెలుస్తోంది. రెండు దేశాల మధ్య సంబంధాల్ని సరైన మార్గంలో నడిపిస్తే..ప్రపంచానికే ప్రయోజనకరమనేది చైనా(China) అభిప్రాయంగా ఉంది. ఈ నేపధ్యంలో అంటే రెండు దేశాల మధ్య జరిగిన చర్చల సారాంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రెండు దేశాల అధ్యక్షుల మధ్య నడిచిన చర్చ..కీలక పరిణామాలకు దారితీస్తుందనేది విశ్లేషకుల అంచనా. అందుకే ఇప్పుడీ రెండు దేశాల అధ్యక్షుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు ప్రాధాన్యత కల్గిస్తున్నాయి.


Also read: Vaccine Effect On Menstrual Cycle: వ్యాక్సినేషన్ తరువాత మహిళల్లో కొత్త సైడ్ ఎఫెక్ట్స్.. అవేంటంటే..??


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook