Joe Biden Impeachment: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌పై అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలతో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు రిపబ్లికన్లు. అంతేకాకుండా అంతా ఏకమై ప్రతినిధుల సభలో ఆమోదించేసారు. బిడెన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి అధారాలు లభ్యం కాకపోయినా మెజార్టీ ఓటుతో సభ ఈ అభిశంసనకు ఆమోదం తెలుపడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కుటుంబ వ్యాపారల విషయంలో అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేది రిపబ్లికన్ల ఆరోపణ. ఇందులో భాగంగా ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. నిబంధనల మేరకు ప్రాధమిక ఆధారాలుంటే ఇలాంటి తీర్మానానికి ఆమోదం తెలుపవచ్చు. కానీ అమెరికా ప్రతినిదుల సభలో రిపబ్లికన్లదే ఆధిపత్యం కావడంతో ట్రంప్ ప్రోద్భలంతో బిడెన్‌పై ప్రవేశపెట్టిన అబిశంసన విచారణకు ఆమోదం లభించింది. సెనెట్ విచారణలో బిడెన్ దోషిగా తేలితే అధ్యక్ష పదవి నుంచి తొలగించే అవకాశముంది. అయితే దీనికి సుదీర్ఘ సమయం పట్టనుంది. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న బిడెన్‌కు ఇది ఇబ్బందికర పరిణామమే.


గతంలో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉండగా రెండుసార్లు అభిశంసన ఎదుర్కొన్నారు. బిడెన్ కుటుంబసభ్యుల వ్యాపారాలపై ఉన్న వివాదాలపై ఏడాదిగా విచారణ జరుగుతున్నా ఏ పురోగతి లేదనందున అభిశంసనకు డిమాండ్ చేశారు రిపబ్లికన్లు. బిడెన్ కుమారుడి విదేశీ వ్యాపార ఒప్పందాల వల్ల బిడెన్‌కు వ్యక్తిగతంగా లబ్ది జరిగిందనేది ఆరోపణ. కానీ అధ్యక్ష, ఉపాధ్యక్ష హోదాలో బిడెన్ అవినీతికి పాల్పడినట్టు ఎలాంటి ఆధారం లభ్యం కాలేదు. 


అమెరికా అధ్యక్షుడి నివాసమైన వైట్‌హౌస్ ఈ అభిశంసనను అర్ధరహితమైందిగా కొట్టివేసింది. ఇది కేవలం రాజకీయ ఎత్తుగడని విమర్శించింది. డోనాల్డ్ ట్రంప్ పలు న్యాయపరమైన చిక్కుల్లో ఉన్నారని, దీన్నించి దృష్టి మరల్చేందుకే రిపబ్లికన్లు అభిశంసన నాటకం ఆడుతున్నారని డెమోక్రటిక్ ప్రతినిధి ఒకరు మండిపడ్డారు. 


Also read: Loksabha Attack: లోక్‌సభలో దాడికి కారణాలు వివరించిన నిందితులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook