Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు.. అసలు కారణాలు ఇవేనా..
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ క్యాండిడేట్ అయిన డొనాల్డ్ ట్రంప్ పై ఎన్నికల ర్యాలీలో కాల్పులు జరిగిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ప్రపంచ అగ్ర రాజ్యాధినేతగా పనిచేసిన మాజీ ప్రెసిడెంట్ పై జరిగిన ఈ ఘటనపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Donald Trump: ఈ యేడాది చివర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై గుర్తు తెలియని ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయమైంది. కాల్పుల ఘటన తర్వాత ఆ కాల్పులు జరిపిన ఆగంతకుడిపై ట్రంప్ భద్రత సిబ్బంది కాల్పులు జరిపి హతమార్చారు. అసలు అతను ఈ ఘటనకు ఎందుకు పాల్పిడినట్టు అనే విషయమై ఇన్వెస్టిగేషన్ జరగుతుంది. అతడు ఎవరు ? అతడి కాల్ డేటా తదితర వివరాలన్ని ఎఫ్బీఐ సేకరించే పనిలో పడింది. దీని వెనక విదేశీ హస్తం ఉందా.. ? ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అనే దానిపై భద్రతా విభాగం ఆరా తీస్తున్నాయి.
పెన్సిల్వేనియాలో ప్రచారం చేస్తుండగా ఆ కాల్పలు ఘటన చోటు చేసుకుంది. దీంతో ట్రంప్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ ఘటన తర్వాత భద్రతా బలగాలు ట్రంప్ ను సమీపంలోని హాస్పిటల్ కు తరిలించారు. ప్రస్తుతం ట్రంప్ క్షేమంగానే ఉన్నట్టు ఆయన భద్రతను పర్యవేక్షిస్తున్న అధికారులు తెలిపారు. మరోవైపు ట్రంప్ పై కాల్పుల ఘటనను ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఖండించారు. ఈ ఘటన వెనక ఎంత పెద్ద వారు ఉన్న వారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నారు. మరోవైపు అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమల హారిస్ ఈ ఘటను తీవ్రంగా ఖండించింది. అమెరికా లాంటి ప్రజాస్వామ్య దేశంలో హింసకు తావు చోటు లేదున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన భద్రతా దళాల సమస్పస్పూర్తిని ఆమె కొనియాడారు. అటు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన దాడిని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా ప్రపంచ దేశాధినేతలు ఖండించారు.
అమెరికాలో ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఎన్నికలు జరగడం ఆనవాయితీ వస్తోంది. ప్రతి నాలుగేళ్లకు జరిగే లీఫ్ ఇయర్ నవంబర్ మొదటి మంగళవారం ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ ఎన్నికల్లో గెలిచిన వారు.. జనవరిలో పదవీ బాధ్యతలు చేపడుతూ వస్తున్నారు. ఈ యేడాది నవంబర్ లో జరగనున్న ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరుపున మరోసారి డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. మరోవైపు డెమాక్రాట్స్ తరుపున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook