American Elections | అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే. అందులో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్, డోనాల్డ్ ట్రంప్ పై విజయం సాధించారు. 2021 జనవరిలో బైడెన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ విషయాన్ని డోనాల్డ్ ట్రంప్ ఇప్పటి వరకు అంగీకరించలేదు. తను గెలిచే అవకాశం ఇప్పటికీ ఉంది అని చెబుతూ ఉన్నాడు. అయితే వాళ్లూ వీళ్లూ చెప్పడం వల్ల అర్థం అయిందేమో గానీ.. జనవరి తరువాత తను ప్రెసిడెంట్ గా ఉండబోను అని తెలుసుకున్నాడు. అందుకే బైడెన్ కు అధికారాలు ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు ట్రంప్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read  | Donald Trump: మెలానియా విడాకులు ఇచ్చేస్తుందా ? రహస్యాలు వెల్లడించిన పీఏ!


అధ్యక్ష ఎన్నికల్లో తను ఓడినట్టు అంగీకరించిన ట్రంప్  జనవరి 20 నాటికి బైడెన్ కు ( Joe Biden ) అధికారాలు బదిలీ చేస్తానని తెలిపాడు. ఆ దిశలో ఏర్పాట్లు చేయమని అధికారులను సూచించాడు. కొత్తగా రానున్న టీమ్ పనులకు తాను అడ్డుతగలబోను స్పష్టం చేశాడు ట్రంప్. ఈ మేరకే ఏం చేయాలో అది చేసేయండి అని ట్వీట్ చేశాడు. ఈ విధంగా అడ్మినిస్ట్రేషన్ విభాగాలకు సూచించాడు.


గత మూడు వారాలుగా ట్రంప్ ( Donald Trump ) ఈ మాటను ఎప్పుడు అంటాడా అని.. తన ఓటమిని ఎప్పుడు అంగీకరిస్తాడా అని వేచి చూశారు. ఎందుకంటే తనను ఓడిపోలేదు అని.. ప్రతిపక్షం రిగ్గింగ్ చేసింది అని ఆరోపించాడు. వరుసగా ట్వీట్లు చేస్తూ ఊదరొట్టాడు. దీంతో ఏం జరుగుతుందో అని చాలా మంది కాస్త హైరానా పడ్డా ఇప్పుడు ట్రంప్ స్వయంగా తప్పుకోవడానికి సిద్ధం అవడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంటోంది. 


ALSO READ| Trump Residency: బిజినెస్ ట్రంప్ బ్లెడ్ లోనే ఉంది... ఇల్లు రాజభవనం కన్నా తక్కువేం కాదు



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR