Joe Biden: ఆఫ్ఘన్ పరిణామాలు అమెరికాకు పెద్ద సవాలుగా మారాయి. తాలిబన్ల గుప్పిట్లో చిక్కుకున్న ప్రజల్ని కాపాడటం ఇబ్బందిగా మారింది. ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా తరలింపు సాధ్యమేనా..జో బిడెన్ ఆందోళనకు కారణమేంటి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ విన్నా ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)గురించే చర్చ నడుస్తోంది. తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించడంతో భయాందోళనలు ఏర్పడుతున్నాయి. ఆఫ్ఘన్‌లో చిక్కుకున్న తమ తమ దేశీయుల్ని రక్షించుకునే ప్రయత్నాల్లో వివిధ దేశాలున్నాయి. ఇప్పటికే అమెరికా చాలామందిని స్వదేశానికి తరలించింది. ఇటు ఇండియా కూడా తమ దేశ ప్రజల్ని తరలిస్తోంది. ఈ క్రమంలో ఇండియాకు చెందిన 150 మందిని తాలిబన్లు కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ చేసిన వ్యాఖ్యలు ఆందోళనను మరింత పెంచడమే కాకుండా..ఆక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. 


తాలిబన్ల (Talibans)చేతిలో చిక్కుకున్న ఆఫ్ఘన్ నుంచి తమ పౌరులు, భాగస్వామ్యదేశాల పౌరుల్ని సాధ్యమైనంత త్వరగా స్వదేశాలకు తరలిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వెల్లడించారు. అయితే అదే సమయంలో ప్రాణాలకు ముప్పు లేకుండా తరలింపు ప్రక్రియ పూర్తి కాబోదని వ్యాఖ్యానించడం ఆందోళన కల్గిస్తోంది. జూలై నుంచి ఇప్పటి వరకూ 18 వేలకు పైగా అమెరికన్లను స్వదేశానికి చేర్చామన్నారు. సంక్లిష్టమైన పరిస్థితుల మధ్య తరలింపు చేపడుతున్నందున ఫలితం ఎలా ఉంటుందనేది చెప్పలేమని జో బిడెన్(Joe Biden)చేతులెత్తేశారు. అటు ఈ సమస్యకు దౌత్యమార్గాల్లో ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని..ఈ క్రమంలో అవసరమైతే తాలిబన్లతో కలిసి పనిచేసేందుకు కూడా సిద్ధమని యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించారు. 


Also read: Afghan Situation: ఆ రోజు ఆ విమానంలో ఎంతమంది ప్రయాణించారో తెలుసా..వింటే నిర్ఘాంతపోతారు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook