H1B Visa: హెచ్1బీ వీసాల విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన కొత్త విధానాన్ని జో బిడెన్ ప్రభుత్వం వాయిదా వేసింది. బిడెన్ తీసుకున్న నిర్ణయంతో ఎవరికి మేలు చేకూరనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అమెరికా ( America ) లో విదేశీయులు ఉద్యోగాలు చేయాలంటే హెచ్1బీ వీసాలు ( H1B Visa ) తప్పనిసరి. చాలా కాలంగా అమెరికాలో లాటరీ పద్ధతి ( Lottery system ) ద్వారానే హెచ్1బీ వీసాలు మంజూరు చేస్తున్నారు. వలసేతర వీసా అయిన హెచ్1 బీ వీసాల్ని ప్రతి యేటా 65 వేలు మంజూరు చేస్తుంటుంది అమెరికా ప్రభుత్వం ( America Government ). ఉన్నత విద్య అభ్యసించిన విదేశీ విద్యార్ధులకు మరో 20 వేల వీసాలు ఇస్తుంటుంది. ఇలాంటి వీసాలుండే విదేశీయులకు పలు కంపెనీలు తక్కువ జీతానికే ఉద్యోగాలిస్తుండటంతో..అమెరికన్లకు ఉద్యోక అవకాశాలు  పోతున్నాయనే భావన ఉంది. ఈ  నేపధ్యంలో కంప్యూటర్ ఆధారిత లాటరీ విధానానికి స్వస్తి పలికి..ప్రతిభ ఆధారంగా హెచ్1బీ వీసాలు జారీ చేసే కొత్త విధానాన్ని డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) ప్రవేశపెట్టారు. 


వాస్తవానికి ఈ ఏడాది అంటే 2021 మార్చ్ 9 నుంచి కొత్త విధానం అమల్లోకి రావల్సి ఉంది. అయితే ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ( America president Joe Biden ) కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ తీసుకొచ్చిన కొత్త విధానాన్ని మరో ఏడాది పాటు వాయిదా వేశారు. ప్రస్తుతానికి లాటరీ విధానం ద్వారానే వీసాలు జారీ చేయనున్నారు. 2021 డిసెంబర్ 31 వరకూ మాత్రమే లాటరీ విధానం అమల్లో ఉండనుంది. రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పులు చేర్పుల కోసం అధికారులకు మరింత సమయం ఇచ్చేందుకే నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ వెల్లడించింది.


Also read: Joe Biden Signatures: కీలక ఉత్తర్వులపై సంతకాలు, కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టం ఇక అమలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook