కరోనా వైరసా.. ఐతే ఏంటట..?
కరోనా వైరస్.. అంటే నాకేంటి భయ్యం అంటోంది.. ఓ చైనీస్ అమ్మాయి. కరోనా వైరస్ గజగజా వణికిస్తున్న వూహాన్ లోనే ఓ అమ్మాయి.. ఐతే ఏంటట..? అంటోంది. అవును.. అంతటితో ఆగకుండా .. ఓ రెస్టారెంట్ లో గబ్బిలంతో చేసిన వంటకాన్ని తింటూ ఓ వీడియో రూపొందించింది.
కరోనా వైరస్.. అంటే నాకేంటి భయ్యం అంటోంది.. ఓ చైనీస్ అమ్మాయి. కరోనా వైరస్ గజగజా వణికిస్తున్న వూహాన్ లోనే ఓ అమ్మాయి.. ఐతే ఏంటట..? అంటోంది. అవును.. అంతటితో ఆగకుండా .. ఓ రెస్టారెంట్ లో గబ్బిలంతో చేసిన వంటకాన్ని తింటూ ఓ వీడియో రూపొందించింది. ఈ వీడియోను ఆ అమ్మాయి ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరు మాంసం తినడానికి భయపడవద్దు.. కానీ మాంసం తినేటప్పుడు దానిపై ఉన్న చర్మాన్ని తినకుండా జాగ్రత్తపడండి.. అంటూ పోస్ట్ చేసింది.
Read Also:ఢిల్లీలో కరోనా వైరస్ కలకలం..?
ప్రస్తుతం చైనాను కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. కరోనా వైరస్ దెబ్బకు ఇప్పటికే 106 మంది మృతి చెందారు. మరో 4 వేలకు పైగా మందికి వైరస్ వ్యాప్తి చెందిందని తెలుస్తోంది. ఇప్పటికే చైనా నుంచి అన్ని రకాల ప్రయాణాలపై నిషేధాలు విధించారు. చైనా చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా కరోనా వైరస్ పై అప్రమత్తంగా ఉన్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..