లెబనాన్ ( lebanon ) రాజధాని నగరం బీరూట్ లో మరోసారి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పోర్టులో జరిగిన భారీ పేలుళ్ల ఘటన మర్చిపోకముందే మళ్లీ అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆగస్టు 4వ తేదీన లెబనాన్ రాజధాని బీరూట్ ( Beerut blast ) లో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. పోర్టు ప్రాంతంలో అక్రమంగా నిల్వ చేసిన అమ్మోనియం నైట్రేట్  లో పేలుడు సంభవించడంతో 191 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. చుట్టుపక్కల భవంతులన్నీ పూర్తిగా ధ్వంసమై...స్మశానంగా మారిపోయింది. ఈ ఘటన ప్రపంచమంతా ఉలిక్కిపడేలా చేసింది. వేలాది మంది నిరాశ్రయులు కాగా..ఇంకా శిధిలాల తొలగింపు కొనసాగుతూనే ఉంది.


ఈ సంఘటన నుంచి తేరుకోకముందే అదే ప్రాంతంలో మళ్లీ అగ్నిప్రమాదం ( Another fire accident ) చెలరేగింది. భారీగా మంటలు రావడంతో ఈ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుపోయింది. ఆయిల్, టైర్లు నిల్వ ఉంచిన గోడౌన్ లో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.  ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారు. ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే అధికారులు తక్షణ సహాయక చర్యలు చేపట్టి లెబనాన్ ఆర్మీ హెలికాప్టర్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పోర్టు సమీపంలోని కార్యాలయాలను ఖాళీ చేయాల్సిందిగా లెబనాన్ ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. Also read: India-Japan: రెండు దేశాల మధ్య రక్షణ ఒప్పందం