Covid19 Test: కచ్చితమైన ఫలితాలు, మార్కెట్ లో మరో కొత్త పరికరం
కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ ఆగేట్టు కన్పించడం లేదు. సాధ్యమైనన్ని ఎక్కువ పరీక్షలు చేయడం ద్వారా మాత్రమే నియంత్రణ సాధ్యం. ఈ నేపధ్యంలో మార్కెట్ లో అందుబాటులో ఉన్న వివిధ రకాల పరీక్షా పరికరాల్లో కొత్తరకం మరో పరికరం వచ్చి చేరుతోంది.
కరోనా వైరస్ ( Corona virus ) మహమ్మారి విజృంభణ ఆగేట్టు కన్పించడం లేదు. సాధ్యమైనన్ని ఎక్కువ పరీక్షలు చేయడం ద్వారా మాత్రమే నియంత్రణ సాధ్యం. ఈ నేపధ్యంలో మార్కెట్ లో అందుబాటులో ఉన్న వివిధ రకాల పరీక్షా పరికరాల్లో కొత్తరకం మరో పరికరం వచ్చి చేరుతోంది.
కోవిడ్ 19 వైరస్ ( Covid10 virus test ) నిర్ధారణ కోసం మార్కెట్ లో మరో కొత్త పరికరం వచ్చి చేరుతోంది. ఈ కొత్త పరికరం ద్వారా కోవిడ్ నడ్జ్ టెస్ట్ ( covid nudge test ) నిర్వహిస్తారు. ఏకంగా 94 శాతం యాక్యురెసీతో మూడు గంటల వ్యవధిలోనే కరోనా ఉందో లేదో తెలిసిపోతుందని పరిశోధకులు అంటున్నారు. మార్కెట్ లో ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న పరికరాలు కేవలం 74 శాతం యాక్యురెసీతో ఫలితాలనిస్తున్నాయనేది పరిశోధకులు చెబుతున్న మాట.
షూ డబ్బా సైజులో ఉండే ఈ పరికరంలో క్యార్టిడ్జెస్ ను ఉపయోగిస్తారు. ముక్కు నుంచి తీసే శ్లేష్మం, నోటి నుంచి తీసే లాలాజలం శాంపిల్ ను ఈ పరికరంలోని క్యార్టిడ్జెస్ లో పంపిస్తారు. మూడు గంటల్లో విశ్లేషించి ఫలితాన్నిస్తుంది. దీని ధర 30 పౌండ్లు అంటే 2 వేల 9 వందల రూపాయలుగా నిర్ణయించారు. ఈ పరికరాన్నిలండన్ లోని ఇంపీరియల్ కళాశాల ( London's imperial college ) కు చెందిన స్పినౌట్ కంపెనీ తయారు చేస్తోంది. తొలిదశలో 5 వేల పరికరాల్ని 58 లక్షల క్యార్టిడ్జ్ లను ఆర్డర్ చేసినట్టు బ్రిటన్ ఆరోగ్య వర్గాలు తెలిపాయి.
ఈ పరికరంతో విద్యాసంస్థలు, థియేటర్లు, ఇళ్ల వద్ద పరీక్షలు నిర్వహించేందుకు దోహదపడుతుంది. ఇటీవల లండన్ లో జరిగిన ప్రఖ్యాత సింఫని ఆర్కెస్ట్రా ( Symphony orchestra ) కచేరీలో ఈ పరికరం ద్వారా కళాకారులకు పరీక్షలు చేసి..అప్పుడు లోపలకు అనుమతించారు. Also read: Donald Trump: ఎన్నికల వేళ.. మరోసారి లైంగిక ఆరోపణలు