Arming Ukraine: ఉక్రెయిన్ కు ఆయుధాలు సప్లై చేస్తున్న అమెరికా.. మండిపడుతున్న రష్యా
రోజు రోజుకు రష్యా - ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మితిమీరుతుంది. లక్ష్యం చేరే వరకు యుద్ధం ఆపేదే లేదని రష్యా.. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేదిలేదు అంటూ ఉక్రెయిన్.. అయితే ఉక్రెయిన్ ఆయుధాల సరఫరా చేస్తున్న అమెరికాపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
US Arming Ukraine: రష్యా ఆగడం లేదు... ఉక్రెయిన్ తగ్గడం లేదు. దీంతో రోజులు గడిచే రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. సహనం కోల్పోయిన రష్యా ఈపాటికే ఉక్రెయిన్ పై కింజల్ హైపర్ సోనికి క్షిపణిలతో విరుచుకుపడుతోంది. అత్యంత ప్రమాదకరమైన క్షిపణులతో రష్యా దాడులు చేయడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. రష్యా దాడిని అమెరికాతో సహా నాటో దేశాలు తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నాయి.
ప్రమాదకరమైన ఆయుధాలను ఉపయోగించకుండా ఉండేందుకు రష్యాపై నాటో దేశాలను ఒత్తిడి తెస్తున్నాయి. ఇందులో భాగంగా రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా ఆంక్షలు విధించాయి. నో ఫ్లై జోన్‌ను ప్రకటించకపోయినా ఉక్రెయిన్‌కు ఆయుధ సమాగ్రి, యుద్ధ వాహనాలను పంపించి సహకరిస్తున్నాయి.
అమెరికా నుంచి మరికొన్ని రోజుల్లో భారీ సంఖ్యలో ఆయుధాలు రానున్నట్టు ఉక్రెయిన్ నేషనల్ సెక్యూరిటీ, డిఫెన్స్ కౌన్సిల్ సెక్రటరీ ఒలెస్కీ డానిలోవ్ తెలియజేశారు. అమెరికా నుంచి వచ్చే ఆయుధాల్లో ట్యాంక్ విధ్వంసక మిస్సైల్ జావెలిన్, స్టింగర్ మిస్సైల్స్ కూడా ఉన్నాయని సమాచారం. మరి కొన్ని రోజుల్లోనే అమెరికా నుంచి ఆయుధాలు దేశానికి వస్తాయని సమాచారం.
అయితే ఉక్రెయిన్‌కు అమెరికా సహకరించడం పై రష్యా ఆగ్రహంగా ఉంది. యుద్ధంలో నేరుగా దిగకపోయినా పరోక్షంగా ఎన్ని రకాలుగా సహకరించాలో అన్ని రకాలుగా సహకరిస్తోందని మండిపడుతోంది. తమ ఇరు దేశాల వ్యవహారంలో జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని రష్యా హెచ్చరిస్తోంది.
తన లక్ష్యం నెరవేరే వరకూ వెనక్కి తగ్గను అని ప్రకటించింది. అయినా ఉక్రెయిన్ వెనుకంజ వేయడం లేదు. రష్యాతో పోరాడుతూనే ఉంది. ఉక్రెయిన్ పౌరులు, సైనికులు రష్యా దళాలతో వీరోచితంగా పోరాడుతున్నారు. అయితే ఈక్రమంలో ఇప్పటి వరకు ఉక్రెయిన్ కు చెందిన 847 మంది పౌరులు చనిపోయారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. మరో 1399 మంది గాయపడ్డారని సమాచారం.
Also Read: IPL 2022: వైరల్ పిక్.. చిరంజీవి హీరోయిన్‌ను చంకనెత్తుకున్న క్రికెట్ కామెంటర్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook