Myanmar: మయన్మార్ సైన్యం తన దేశంలోని ఓ గ్రామంపై వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో కనీసం 40 మంది మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు. బాంబు పేలుడు కారణంగా సంభవించిన మంటల్లో వందలాది ఇళ్లు దగ్ధమయ్యాయి. సమాచారం ప్రకారం, పశ్చిమ రఖైన్ రాష్ట్రంలో జాతి అరకాన్ ఆర్మీ నియంత్రణలో ఉన్న రామ్రీ ద్వీపంలోని క్యుక్ ని మావ్ గ్రామంలో ఈ దాడి జరిగింది. మయన్మార్ లో సైన్యం దురాగతాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఎంతో మందిని పొట్టనబెట్టుకున్న సైన్యం..తాజాగా ఓ సాయుధ మైనార్టీ గ్రూపు ఆధీనంలో ఉన్న గ్రామంపై వైమానిక దాడులకు పాల్పడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఘటనలో 40 మంది మరణించారు. 20 మందికి గాయాలైనట్లు స్థానిక స్వచ్చంద సంస్థ అధికారులు తెలిపారు. పశ్చిమ రఖైన్ రాష్ట్రంలో రామ్రీ ద్వీపంలో అరకాన్ ఆర్మీ ఆధీనంలో ఉన్న క్యౌక్ నీ మావ్ అనే గ్రామంపై జరిపిన దాడుల్లో వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ తీవ్ర విషాదకర పరిస్థితులు నెలకున్నాయి. ప్రస్తుతం ఆ గ్రామంలో ఇంటర్నెట్ సర్వీసులు, సెల్ ఫోన్ సేవలను నిలిపివేశారు. 


Also Read: KT Rama Rao: 'అది లొట్టపీసు కేసు.. రేవంత్ రెడ్డి ఒక లొట్టపీసు సీఎం'.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు


 




2021 ఫిబ్రవరిలో ఆంగ్ సాన్ సూచీ సారథ్యంలోని ప్రజా ప్రభుత్వాన్ని గద్దె దించి అధికారకం లాక్కున్నప్పటి నుంచి సైనిక పాలనను వ్యతిరేకించే వారిపై దురాగతాలు పెచ్చుమీరుతూనే ఉన్నాయి.  ఎదురుతిరిగే వారిని అణిచివేసేందుకు సైన్యం పెద్దెత్తున వైమానిక దాడులకు పాల్పడుతోంది. శాంతియుత ప్రదర్శనలను అణిచివేసేందుకు ప్రయత్నించడంతో అనేక మంది సైనిక పాలనను వ్యతిరేకిస్తూ ఆయుధాలు చేతబట్టాల్సిన పరిస్థితులు అక్కడ నెలకున్నాయి. 


 


Also Read: Beer Supply: బీర్ విక్రయాల బంద్‌పై ప్రభుత్వం సంచలన ప్రకటన! బీర్‌లు ఉంటాయా.. లేవా?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook