Beer Supply Stops: తెలంగాణలో బీర్ సీసాల విక్రయాలు ఉండవని ఉత్పత్తి చేసే సంస్థ ప్రకటించిన నేపథ్యంలో మందుబాబులు ఆందోళన చెందుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. చెల్లించాల్సిన బిల్లుల బకాయిపడడంతో కంపెనీలు బీర్ల విక్రయాలను ఆపివేయడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా బీర్ల విక్రయాలు, బీర్ల కంపెనీల బిల్లుల పెండింగ్ వంటి అంశాలపై వివరణ ఇచ్చారు.
Also Read: KT Rama Rao: కేటీఆర్‌కు భారీ ఊరట.. ఏసీబీ విచారణకు లాయర్‌తో ఒకే!
ధరలు పెంచకపోవడంతో బీర్‌లు సరఫరా చేయమని బేవరేజ్ సంస్థ ప్రకటించిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. '33 శాతం పెంచమని అడుగుతున్నారు. ఇలా పెంచితే ఇప్పుడు ఉన్న రూ.150 బీర్ రూ.250కు పెరుగుతుంది. బేవరేజ్ సంస్థ అడిగినట్లు ధరలు పెంచితే ప్రజలపై భారం పడుతుంది' అని వెల్లడించారు. బీర్‌ల ధరలు పెంచడంపై రిటైర్డ్ జడ్జితో కమిటీ వేశామని.. కమిటీ నివేదిక వచ్చాక ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read: KT Rama Rao: 'అది లొట్టపీసు కేసు.. రేవంత్ రెడ్డి ఒక లొట్టపీసు సీఎం'.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'బేవరేజ్ సంస్థ గుత్తాధిపత్యంగా ప్రవర్తిస్తోంది' అని మంత్రి జూపల్లి ఆరోపించారు. ఆ సంస్థ డిమాండ్‌లను తాము తిరస్కరించామని చెప్పారు. 'బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. నష్టాల్లో తాము ఉన్నామని ఆ సంస్థ చెబుతోంది. కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన బకాయిలు కొన్ని ఉన్నాయి. రూ.1,100 కోట్లు చెల్లించాం. ఇప్పుడు రూ.650 కోట్లు పెండింగ్ ఉంది' అని వివరించారు. సంస్థ బీర్‌లు సరఫరా చేయమని చెప్పడంతో బీర్‌ల కొరతపై కీలక ప్రకటన చేశారు. 'రాష్ట్రంలో 14 లక్షల బీర్ కేసులు ప్రస్తుతం నిల్వం ఉంది' అని మంత్రి ప్రకటించారు.
బీర్‌ల ధరల విషయమై మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. 'ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో బీర్‌ల ధరలు కొంత తక్కువగా ఉన్నాయి. కర్ణాటకలో రూ.190, ఏపీలో రూ.180 ఉంటే తెలంగాణలో బీర్ ధర రూ.150 ఉంది' అని వివరించారు. 'ఒత్తిళ్లకు మా ప్రభుత్వం లొంగదు. మేము వచ్చాక ఒక్క పైసా కూడా పన్ను పెంచలేదు' అని చెప్పారు. బేవరేజ్ సంస్థకు ప్రస్తుతం రూ.658.95 కోట్ల బిల్లు పెండింగ్‌లో ఉంది' అని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.