Northern China: ఇటీవల కురిసిన భారీ వర్షాలు చైనాకు భారీ నష్టాన్నే కలిగించాయి. ఉత్తర చైనా(Northern China)లోని షాంక్సీ ప్రావిన్స్‌(Shanxi province)లో ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాల(Heavy Rains)కు 15 మంది మృతి చెందగా.. ముగ్గురు గల్లంతైనట్టు అధికారులు వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షాంక్సీ ప్రావిన్స్‌లోని దాదాపు 1.20లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు పేర్కొన్నారు. అక్టోబర్‌ 2నుంచి 7వరకు రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి దాదాపు 10లక్షల మందికి పైగా జనం ప్రభావితమైనట్టు అధికారులు తెలిపారు. ఈ వర్షాలకు 2,36,460 హెక్టార్లలో పంటలు నాశనం కావడంతో పాటు 37,700 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అలాగే, 6021 కి.మీల మేర రహదారులు కూడా దెబ్బతిన్నాయి. దీంతో చైనాకు 780 మిలియన్‌ డాలర్ల మేర ప్రత్యక్షంగా ఆర్థికనష్టం వాటిల్లినట్టు చైనా అధికార మీడియా సంస్థ జిన్హువా స్పష్టం చేసింది. 


Also read: Viral: అరటి గెల మీద పడింది..అతడు కోటీశ్వరుడయ్యాడు..!


నెల ప్రారంభంలో కురిసే సాధారణ వర్షపాతం కన్నా ఐదు రెట్లు ఎక్కువగా షాంక్సీ ప్రావిన్స్‌లో నమోదు కావడంతో పలు ఆనకట్టలు, రైల్వే లైన్లు దెబ్బతిన్నాయని తెలిపింది. ప్రధానంగా బొగ్గు ఉత్పత్తి(Coal production) కేంద్రంగా ఉండే ఈ ప్రాంతంలో 60 బొగ్గు గనులు మూతపడ్డాయి. ప్రస్తుతం విద్యుత్‌ కోతలతో సతమతమవుతున్న ఈ గనులు మూతపడటంతో ఇంధన సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల నిమిత్తం అధికారులు 7.8 మిలియన్ డాలర్ల మొత్తాన్ని కేటాయించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook