బుధవారం ఈజిప్టులోని ఉత్తర ప్రాంతంలోని బీహైరాలో జరిగిన రైలు ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, మరో 40 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం ధృవీకరించింది. గూడ్స్ రైలు, ప్రయాణీకులతో వెళుతున్న ప్యాసింజర్ రైలు ఎదురెదురుగా ఢీకొన్నాయని రవాణా మంత్రిత్వశాఖ ప్రతినిధి, అధికారిక వార్తా సంస్థ ఎంఈఎన్ఎకి వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రధాన మంత్రి షరీఫ్ ఇస్మాయిల్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే ప్రమాద స్థలికి వెళ్లాలని రవాణా మంత్రిని ఆదేశించారు. రైల్వే సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.


కాగా, రైల్వేలలో ప్రాథమిక భద్రతా ప్రమాణాలను అమలు చేయడంలో ప్రభుత్వాలు వరుసగా విఫలమవుతున్నారని ఈజిప్షియన్ల వాదన. చాలకాలం నుండి ఫిర్యాదులు కూడా చేశారు. పాతకాలపు రైల్వే నెట్వర్క్ పై  అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 


ఆగస్టులో కూడా ఇలానే రెండు రైళ్లు ఢీకొట్టుకోవడంతో 42 మంది మృతి చెందారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు.