US Tornado: అమెరికాలో టోర్నడో బీభత్సం.. 50 మంది మృతి!
US Tornado: అమెరికాలో టోర్నడో విలయానికి 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
US Tornado: అమెరికా(America)లో టోర్నడో బీభత్సం సృష్టించింది. అగ్నేయ రాష్ట్రం కెంటకీ(Kentucky)లో టోర్నడో ధాటికి సుమారు 50 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషీర్(Andy Beshear) తెలిపారు. రాష్ట్రంలో సుమారు 200మైళ్ల మేర పలు జిల్లాలను బలమైన టోర్నడో(Tornado) చుట్టేసినట్లు చెప్పారు. కెంటనీ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన టోర్నడోగా బెషీర్ పేర్కొన్నారు. మృతుల సంఖ్య 70-100 మధ్యకు చేరుకునే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఓ క్యాండిల్ ఫ్యాక్టరీలో పైకప్పు కుప్పకూలటంతో భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
Also Read: Mexico truck accident: వలసదారులతో వెళ్తున్న ట్రక్కు బోల్తా- 53 మంది మృతి
టోర్నడోలతో భారీగా ఇళ్లు నేలమట్టం అయ్యాయి. దీంతో అక్కడ సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు గవర్నర్ ప్రకటించారు. సహాయ చర్యల కోసం 180 మంది సిబ్బందిని రంగంలోకి దించామని, స్థానికంగా ఉండే పోలీసులు, ప్రభుత్వం ఉద్యోగులు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి తగిన సాయం అందించాలని ఫెడరల్ ప్రభుత్వాన్ని కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook