Vienna terror attack: 2 killed, many injured: ఉగ్రవాద దాడితో ఆస్ట్రియా (Austria) దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దేశంలోని సెంట్రల్ వియ‌న్నా (Vienna ) లో సోమవారం సాయంత్రం కాల్పుల ఘ‌ట‌న చోటుచేసుకుంది. వియాన్నా నగరంలోని ఆరు ప్రాంతాల్లో ఉగ్రవాదులు రైఫిళ్ల‌తో కాల్పులకు (Terror attack) తెగబడ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మ‌ర‌ణించగా.. చాలా మంది గాయాలపాలయ్యారు. అయితే ఓ అనుమానితుడిని మట్టుబట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దాడికి పాల్పడిన మరొకరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆస్ట్రియా రాజధాని వియ‌న్నా సెంట్ర‌ల్‌లో ఉన్న యూద మందిరం వ‌ద్ద కాల్పులు జరిగాయి. అయితే మొత్తం ఆరు ప్రాంతాల్లో ముష్కరులు కాల్పులు జరిపారని.. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. 14 మంది గాయ‌ప‌డ్డార‌ని, ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరో ఉగ్రవాది కోసం నగరం అంతాటా తనిఖీలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోవిడ్ (Covid-19) కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఆస్ట్రియా దేశంలో లాక్‌డౌన్ విధించారు. తాజా మార్గదర్శకాల ప్రకారం సడలింపులు కల్పించడంతో.. బార్లు, రెస్టారెంట్ల వ‌ద్ద ఉన్న జనాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నారు. ఆ స‌మ‌యంలో భారీ ఆయుధాల‌తో వ‌చ్చిన ఉగ్రవాదులు కేఫ్‌లు, రెస్టారెంట్ల వ‌ద్ద ఉన్న జ‌నంపై విచక్షణ రహితంగా కాల్పులు జ‌రిపారు. అయితే ఈ ఉగ్రవాద దాడిని ఆస్ట్రియా ఛాన్స‌ల‌ర్ సెబాస్టియ‌న్ కుర్జ్ ఖండించారు. ఖచ్చితంగా ఇది ఉగ్రవాద దాడేనని ఆయన వెల్లడించారు. ఉగ్రవాదులను వదిలిపెట్టేది లేదని, వారికి తగిన బుద్ధి చెబుతామని వెల్లడించారు.  Also read: Tedros Adhanom Ghebreyesus: క్వారంటైన్‌లోకి డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్


ఇదిలాఉంటే.. ఈ ఉగ్ర‌దాడిని యురోపియ‌న్ నేతలు ఖండించారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని ప్రకటనలను విడుదల చేశారు. ఇదిలాఉంటే.. ఇటీవల కాలంలో.. పారిస్, లండన్, బెర్లిన్, బ్రస్సెల్స్ వంటి దేశాల్లో సైతం ఉగ్రవాద దాడులు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరగడంతో.. అన్ని దేశాల్లో భద్రతా దళాలను అప్రమత్తం చేశారు.  Also read: India: పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాలను ఖాళీ చేయాలి: భారత్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe