Highest Salary Paid Country: అత్యధిక జీతం చెల్లించే దేశం ఇదే.. భారత్ ర్యాంక్ ఎంతంటే..?
Average Salary In India: ప్రపంచంలో నెలకు అత్యధిక జీతం చెల్లించే దేశాలలో స్విర్జాలాండ్ టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ దేశంలో నెలకు సగటున 6298 డాలర్లు పొందుతున్నారు. సెకెంట్ ప్లేస్‌లో లక్సెంబర్గ్ దేశం ఉంది. ఇక మన దేశం ఏ స్థానంలో ఉందంటే..?
Average Salary In India: ప్రపంచవ్యాప్తంగా వివిధ ఉద్యోగాల్లో పనిచేస్తూ.. జీతం మీద ఆధారపడి కోట్లాది మంది జీవిస్తున్నారు. కూటి కోసం కోటి విద్యలు అన్నట్లు.. ఉద్యోగులు ఎంతకష్ట పడినా.. నెలఖరున జీతమే కోసమే.. వచ్చిన జీతంలో ఖర్చులు లెక్కలు వేసుకుని.. ఏదైనా కొంత మిగిలితే భవిష్యత్ అవసరాల కోసం దాచుకుంటారు. జీతం చాలకపోతే కొందరు కంపెనీలు మారుతూ.. తమ ప్రొఫైల్‌తోపాటు శాలరీని కూడా పెంచుకుంటారు. చేసే పని ఒక్కటే అయినా.. కొన్ని కంపెనీలు ఎక్కువ జీతం ఇస్తుంటే.. మరికొన్ని కంపెనీలు తక్కువ జీతం చెల్లిస్తున్నాయి. ఎక్కువ శాలరీ ఇచ్చే విషయంలో మన దేశం కంటే చాలా దేశాలు ముందు ఉన్నాయి. మరికొన్ని దేశాలు మనకంటే ఇంకా వెనుక కూడా ఉన్నాయి. ప్రపంచంలో నెలకు ఎక్కువ శాలరీ చెల్లించే దేశాలపై ఓ లుక్కేయండి.
వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం.. యూరోప్ దేశమై స్విట్జర్లాండ్ దేశంలో ఉద్యోగులు ఎక్కువ శాలరీ పొందుతున్నారు. ఇక్కడ అత్యధిక సగటు నెలవారీ జీతం అందుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. నెలకు యావరేజ్ శాలరీ దాదాపు 6298 డాలర్లుగా ఉంది. ఆ తరువాత లక్సెంబర్గ్ దేశం రెండోస్థానంలో ఉంది. ఈ దేశంలో సగటు నెలవారీ జీతం 5122 డాలర్లు అందుకుంటున్నారు. సింగపూర్ మూడోస్థానంలో ఉంది. ఇక్కడ సగటు మంత్లీ శాలరీ 4990 డాలర్లుగా ఉంది.
నెలవారీ జీతం 4664 డాలర్లతో అమెరికా నాలుగో స్థానంలో ఉంది. ఐస్‌లాండ్ దేశంలో నెలవారీ సగటు జీతం 4383 డాలర్లు పొందుతున్నారు. ఖతార్ నెలవారీ జీతం $4147. నెదర్లాండ్స్ 3550 డాలర్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. 9వ స్థానంలో యూఏఈ ($3511), నార్వే ($3510) 10వ స్థానంలో ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ చాలా దూరంలో ఉంది. నెలవారీ సగటు జీతం 594 డాలర్లతో 64వ స్థానంలో ఉంది. మన దేశం టాప్-10లోకి చేరాలంటే.. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.
Also Read: Anasuya: వెక్కివెక్కి ఏడ్చిన అనసూయ.. అసలు కారణం ఇదేనా..?
Also Read: Asia Cup 2003: ఈ నెల 21న ఆసియా కప్‌కు టీమిండియా జట్టు ప్రకటన.. ఈ ప్లేయర్లు ఉంటారా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook