Baba Vanga Predictions: శాస్త్ర పరిజ్ఞానం ఎంతగా అభివృద్ది చెందినా బాబాల మాటలు ప్రభావం చూపిస్తూనే ఉంటున్నాయి. ఇప్పుడు బాబా వంగా మాటలు నిజమౌతుండటంతో..దేశం గురించి చెప్పిన రెండు అంచనాలు ఇప్పుడు ఆందోళన కల్గిస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యం, బాబాల అంచనాలు ప్రతిదేశంలో ఉండేవే. కొంతమంది బాబాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరిగే ఘటనలు, పరిణామాల గురించి ముందే అంచనాలు వేసి చెబుతుంటారు. వాటినే ప్రెడిక్షన్స్ అంటారు. ఆ ప్రెడిక్షన్స్ నిజమైనప్పుడు నమ్మకం పెరుగుతుంది. అంచనాలపై ఆందోళన కూడా పెరుగుతుంది. అదే జరుగుతోంది బాబా వంగా మాటలపై. 


12 ఏళ్ల వయస్సులో కంటిచూపు కోల్పోయిన వంగ. కానీ భగవంతుడు ఆమెకు అద్భుతమైన అతీత శక్తులిచ్చాడని..ఆ శక్తులతో భవిష్యత్‌ను ఊహించగలుగుతుందని అంటారు. ఎందుకంటే ప్రపంచం గురించి ఆమె చెప్పిన చాలా అంచనాలు నిజమయ్యాయి. ఇప్పుడు ఇండియా గురించి జరగబోయే రెండు అంచనాలు ఆందోళన కల్గిస్తున్నాయి.


ఎవరీ బాబా వంగ​


బాబా వంగ బల్గేరియాకు చెందిన మహిళ. 12 ఏళ్ల వయస్సులో కంటిచూపు కోల్పోయిన తరువాత దేవుడు అందుకు ప్రతిగా అతీంద్రియ శక్తులు ప్రసాదించాడని చాలామంది చెబుతుంటారు. ఆమె ప్రపంచం గురించి చెప్పిన చాలా అంచనాలు నిజమవడమే ఇందుకు కారణం. 2022 ప్రారంభం గురించి ఆమె చెప్పిన రెండు అంచనాలు నిజమయ్యాయి. అదే విధంగా భారతదేశం గురించి ఆమె చెప్పిన అంచనాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ప్రపంచంతో సహా ఇండియా భయపడుతోంది. ఆమె చెప్పింది నిజమైతే పరిస్థితి ఏంటనే ఆందోళన కలుగుతోంది. 


ఏవి నిజమయ్యాయి


బ్రిటీష్ వెబ్‌సైట్ ది సన్ ప్రకారం బాబా వంగ 2022 ప్రారంభం గురించి అంచనాలు వెల్లడించింది. అందులో రెండు నిజమయ్యాయి. ఆస్ట్రేలియాలో భయంకరమైన వరదలుంటాయని, కరవు కాటకాలు, నీటి కొరత ఉంటాయనేవి. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా తూర్పు తీరం ప్రాంతంలో భయంకరమైన వర్షాలు నమోదై..వరదలు సంభవించాయి. ఇక రెండవది పెద్ద నగరాలు కరువును ఎదుర్కొంటాయనేది. అయితే ఎప్పుడు ఎక్కడ జరుగుతుందనేది ఆమె చెప్పకపోయినా..ఈ అంచనా కూడా యూరప్, బ్రిటన్ , ఇటలీ, పోర్చుగల్‌లో నిజమైంది. చుట్టూ భారీ భారీ గ్లేసియర్లను కలిగి ఉన్న ఈ ప్రాంతాల్లో కరవు పరిస్థితులు ఎదురయ్యాయి.


బ్రిటన్ లో అయితే కరవుని అధికారికంగా ప్రకటించింది ప్రభుత్వం. నైరుతి, దక్షిణం, మధ్య, తూర్పు ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రమైంది. బ్రిటన్‌తో పాుట ఇటలీ, పోర్చుగల్‌లో కూడా ఇదే పరిస్థితి. ప్రజలు నీళ్లను పొదుపు చేయాలని ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేసింది. బాబా వంగ మరో రెండు అంచనాలున్నాయి. రష్యా, సైబీరియా ప్రాంతంలో ఈ ఏడాది అత్యంత భయంకరమైన వైరస్ కొనుగొంటారని తెలిపింది. ఈ వైరస్ ప్రపంచమంతా విస్తరించి లక్షలాదిమంది చనిపోతారని ఉంది. ఈ అంచనాపై ప్రపంచం ఆందోళన చెందుతోంది. 


ఇండియాపై బాబా వంగ అంచనాలు


బాబా వంగ ఇండియా గురించి చాలా తీవ్రమైన అంచనాలు తెలిపింది. దేశంలో ఉష్ణోగ్రత పడిపోతుందని..ఫలితంగా క్రిమికీటకాలు లేదా లోకస్ట్స్ లేదా మిడతలు పెరుగుతాయని వెల్లడించింది. పచ్చదనం, ఆహారం కోసం లోకస్ట్స్ లేదా మిడతలు గుంపులుగుంపులుగా దేశంపై దాడి చేస్తాయని తెలిపింది. ఇది పంటలకు తీవ్ర నష్టం కల్గిస్తుంది. ఈ రెండు అంచనాలపై దేశం మొత్తం ఇప్పుడు ఆందోళన చెందుతోంది. కారణం గతంలో ఆమె చెప్పిన అంచనాలు నిజమవడమే.


1996లో ఆమె మరణించింది. ఆమె చెప్పిన అంచనాలేవీ లిఖితపూర్వకంగా లేకపోయినా..మొత్తంత 5079 అంచనాలున్నాయి. అందులో బ్రిటన్ రాణి డయానా మరణం, అమెరికాలో ట్విన్ టవర్స్ దాడి బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడు కావడం వంటివి నిజమయ్యాయి. అయితే ఆమె చెప్పినవాటిలో నిజం కానివి కూడా ఉన్నాయి. 2016లో యూరప్‌లో భారీ యుద్ధం జరుగుతుందని..మొత్తం ఖండాన్ని నాశనం చేస్తుందని చెప్పింది. ఇది నిజం కాలేదు. 2010 నుంచి 2014 మధ్యంలో ప్రపంచంలో న్యూక్లియర్ యుద్దం జరుగుతుందని తెలిపింది. ఇది కూడా నిజం కాలేదు. 


Also read: షాకింగ్.. ప్రముఖ రచయిత సల్మాన్ రష్డీపై హత్యాయత్నం.. స్టేజీ పైనే 15 సార్లు కత్తితో పొడిచిన దుండగడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook