Arrest Warrant to Gautam Adani: అమెరికాలో మోసం, లంచం ఆరోపణలపై భారత బిలియనీర్‌ గౌతమ్‌ అదానీపై యూఎస్‌ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి అరెస్ట్‌ వ్యారెంట్‌ కూడా జారీ చేసింది. అమెరికాలోని భారత అధికారులకు రానున్న 20 ఏళ్లలో 2 బిలియన్‌ డాలర్ల సోలర్‌ కాంట్రాక్ట్‌ పొందేందకు లంచం ముట్టజెప్పారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై న్యూయర్క్‌లో కేసు నమోదు అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికాలో సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందకు భారత బిలియనీర్‌ అక్కడి ప్రభుత్వ అధికారులకు 260 మిలియన్‌ డాలర్లకు పైగా చెల్లించారనే ఆరోపణలు బయటకు వచ్చాయి. తద్వారా ఆయన రెండు బిలియన్‌ డాలర్ల ఆదాయం పొందేందుకు ప్రయత్నించారని అమెరికా చెబుతోంది. దీనికి ఇంకా గౌతమ్‌ అదానీ స్పందించాల్సి ఉంది.
 


అదానీ కేసుపై పూర్తి వివారాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఓ ప్రకటన అధికారికంగా బయటకు రావాల్సి ఉంది. యూఎస్‌ ఫారిన్‌ కరప్ట్‌ ప్ట్రాక్టీసెస్ యాక్ట్ ఉల్లంఘించినందుకు ఈ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేశారు. అమెరికాలో సోలార్‌ కాంట్రాక్టులు పొందేందుకు లంచం ఇచ్చి లబ్ది పొందేందుకు అదానీ ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో భాగంగా బిలియనీర్‌ అదానీతోపాటు అతని మేనల్లుడు సాగర్‌ అదానీతోపాటు మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేసి వారెంట్‌ కూడా జారీ చేశారు. మరోవైపు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్‌ అంటోంది. 
 


ఇదీ చదవండి:  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వీళ్లకు మాత్రమే.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!  


ఇదీ చదవండి:  కస్తూరికి బిగ్‌ రిలీఫ్‌.. బెయిల్‌ మంజూరు చేసిన ఎగ్మూరు కోర్టు, పూర్తి వివరాలు..  


 


అదానీ గ్రూప్‌ చైర్మన్‌ లంచం ఇచ్చి లబ్ది పొందేందుకు మోసాలకు పాల్పడ్డారని అమెరికా ఆరోపణలు చేస్తోంది.  ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అదానీ సోలార్‌ ప్రాజెక్టుల కాంట్రాక్టుల విషయంలో కేసు నమోదు చేశామని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. రానున్న 20 ఏళ్లలో రెండు బిలియన్‌ డాలర్లు లబ్ది పొందేందుకు ఈ మోసానికి పాల్పడ్డారని చెబుతున్నాయి. అయితే, ఇటీవలి కాలంలో హిండెన్‌బర్గ్ కూడా పదేపదే అదానీపై ఆరోపణలు చేస్తూనే ఉంది. దీనిపై బీజేపీ కూడా తిప్పికొట్టింది. ఏ ఎన్నికలు జరిగినా హిండెన్‌బర్గ్‌ ఇలా భారత్‌పై ఆరోపణలు చేస్తూ ఉండటం సహజం. అయితే, ఈ విషయంలో అమెరికా, భారత్‌ సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడదని నిపుణులు అంచనా వేస్తున్నారు.


తాజాగా ఎవరైనా దేశ చట్టప్రకారం మాత్రమే నడుచుకుంటారు. కాబట్టి అదానీ ఆరోపణలపై పూర్తిగా విచారణ చేపట్టాల్సి ఉంది. ఇది ఒక ఆరోపణ అనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఆరోపణలో అతని మేనల్లుడు సాగర్‌ అదానీపై ప్రధాన ఆరోపణలు చేస్తోంది. మొత్తం 250 మిలియన్లకు పైగా లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిన్న అదానీ 600 మిలియన్‌ డాలర్ల గ్రీన్ బాండ్స్‌ రైజ్‌ చేసిన వెంటనే ఈ ఆరోపణలు బయటకు రావడం గమనార్హం. గతంలో కూడా హిండెన్‌బర్గ్‌ చేసిన అభియోగలపై ఎన్నోసార్లు షేర్లపై ప్రభావం చూపించింది. అయితే, ఈ కేసులో సాగర్‌ అదానీ సెలఫోన్ ఆధారాలుగా ట్రాక్‌ చేస్తున్నారు. గ్రీన్‌ ఎనర్జీకి చెందిన ఇద్దరు ప్రతినిధులపై ఈ ఆరోపణలు వస్తున్నాయి.
 


 




 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.