ఈ చేప ఖరీదు అక్షరాల రూ.21 కోట్లు!!
ఈ చేప ఖరీదు అక్షరాల రూ.21 కోట్లు!!
టోక్యో: ఈ చేప ఖరీదు అక్షరాల రూ.21 కోట్లు!! ఏంటి నమ్మలేకపోతున్నారా ? కానీ అదే నిజం. మన దగ్గర ఏడాదికోసారి గోదావరి నదిపై ఎదురీదుతూ వచ్చే పులస చేపకు ఎంత డిమాండో జపాన్‌లో అంతకు కొన్ని వేల రెట్ల డిమాండ్ ఈ చేప సొంతం. అందుకు కారణం జపాన్ వాసులు అత్యంత ఇష్టంగా అవురావురుమని ఆరగించే చేప కూరల్లో ఇదీ ఒకటి కావడం. ఆ చేప కూరకు వున్న రుచి మహత్యం అటువంటిది మరి. అందుకే జపాన్‌లో కియోషి కిమురా అనే ఓ హోటల్ యజమాని 278 కిలోల బరువు ఉన్న ఈ చేపను సుమారు 333.6 మిలియన్ల యెన్‌లు (భారతీయ కరెన్సీలో రూ.21 కోట్లు) వెచ్చించి సొంతం చేసుకున్నాడు. ఇంతకు అంత భారీ డిమాండ్ వున్న ఈ చేప పేరు ఏంటనే కదా మీ డౌట్!! అక్కడికే వస్తున్నాం.. ఈ చేప పేరు బ్లూఫిన్ టునా. ప్రస్తుతం జపాన్ ఫిష్ మార్కెట్‌లో వున్న అన్ని చేపల్లో రారాజు ఈ బ్లూఫిన్ టునానే. బ్లూఫిన్ టునా తర్వాతే ఏ తర్వాతే ఏ చేప అయినా.
జపాన్ వాసులు ఇష్టపడే చేప కూర వంటకాల్ని తన రెస్టారెంట్‌లో వడ్డివార్చేందుకు ఇష్టపడే కియోషి కిమురా.. ఆరేళ్ల క్రితం కూడా ఇలాగే సుమారు రూ. 10 కోట్లు పెట్టి ట్యూనా ఫిష్‌ను కొనుగోలు చేశాడు. అలా ఆరేళ్లపాటు ఇతర రెస్టారెంట్ యజమానులతో పోటీపడి మరీ ట్యూనా ఫిష్‌ని సొంతం చేసుకున్న కియోషి కిమురా.. గతేడాది మాత్రమే వేలంలో వెనుకబడి ఆ చేపను దక్కించుకోలేకపోయాడట!.