Russia vs Ukraine: ఉక్రెయిన్‌, రష్యా సైనికులు నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి. కీలక నగరాలను స్వాధీనం చేసుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని కీలక నగరాలను రష్యా ఆక్రమించుకుంది. ఇందులో కొన్ని తిరిగి ఉక్రెయిన్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో మరో వార్త హాట్ టాపిక్‌గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరియోపోల్‌లో ఉక్రెయిన్ జరిపిన దాడిలో 40 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. వారంతా ఉక్రెయిన్ సైనికులేనని రష్యా మద్దతుదారులు వెల్లడించారు. ఉక్రెయిన్‌ జరిపిన బాంబు దాడిలో వీరంతా చనిపోయిందని చెబుతున్నారు. ఇందులో పలువురికి గాయాలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఒలెనివ్కాలోని జైలుపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈఐతే దీనిని ఉక్రెయిన్ ఇంతవరకు ఖండించలేదు.


గత కొన్ని నెలలుగా ఇరు దేశాల మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఈక్రమంలోనే మరియోపోల్‌ సమీపంలోని ఓడరేవుల వద్ద ఉక్రెయిన్ సైనికులు కాపల కాస్తున్నారు. ఐతే రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత అక్కడ భద్రతను రెట్టింపు చేశారు. పుతిన్ సైన్యంతో ఉక్రెయిన్ సైనికులు భీకరంగా పోరాడారు. చివరకు వారికి తలొగ్గారు. ఆ తర్వాత వారిని రష్యా బంధించింది.


ఇప్పుడు వారంతా ఒలెనివ్కాలని జైలులో ఉంటున్నారు. వారిపై ఉక్రెయిన్ బాంబు దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు 40 మంది చనిపోయగా..వందల్లో గాయడినట్లు అక్కడి వార్త సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఐతే ఉక్రెయిన్ ఉద్దేశ పూర్వకంగా చేసిందా..లేక రష్యా సైనికులను అడ్డుకునే క్రమంగా జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది.


Also read:Ramarao on duty: పవిత్ర లోకేష్ కనిపించగానే థియేటర్లలో గోలగోల.. మాములు రచ్చ కాదుగా!


Also read:KTR: కేటీఆర్ బర్త్ డే వేడుకలకు రాలేదని ఉద్యోగులకు నోటీసులు.. విమర్శలు రావడంతో వెనక్కి   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook