Newyork: కొన్ని ప్రాంతాల్లో నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తారు. నిబంధనలు ఉల్లంఘిస్తే దేశాధ్యక్షుల్ని కూడా లెక్కచేయరు. కరోనా ప్రోటోకాల్ కచ్చితంగా పాటించే క్రమంలో ఆ హోటల్ యాజమాన్యం ఓ దేశాధ్యక్షుడిని కూడా నో చెప్పేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి(Corona Pandemic)నియంత్రణకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని అందరూ చెబుతున్నారు. ఇందులో భాగంగానే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేకపోతే నో ఎంట్రీ నిబంధనలు కూడా ఉన్నాయి. ప్రభుత్వాలు కాదు..ప్రైవేట్ హోటళ్లు కూడా ఈ నిబంధనల్ని తప్పనిసరిగా ఫాలో అవుతున్నాయి. ఈ క్రమంలో ఏకంగా ఓ దేశాధ్యక్షుడికి పరాభవం ఎదురైంది. అదేంటో చూద్దాం.


ఐక్యరాజ్యసమితి(UNO)సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారోకు ఎదురైన చేదు అనుభవమిది. కరోనా మహమ్మారి నియంత్రణకై వ్యాక్సినేషన్ నిబంధన అమల్లో ఉంది. వ్యాక్సిన్ చేయించుకోకపోతే నో ఎంట్రీ నిబంధనను కచ్చితంగా పాటిస్తున్నారు. ఈ క్రమంలో న్యూయార్క్‌లోని ఓ రెస్టారెంట్‌కు భోజనం చేసేందుకు బ్రెజిల్ (Brazil)అధ్యక్షుడు బోల్సొనారో వెళ్లారు. అయితే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేకపోవడంతో హోటల్ యాజమాన్యం ఆయన్ని లోపలకు అనుమతివ్వలేదు. దాంతో చేసేదేమీలేక..నిస్సహాయంగా బయటికొచ్చేశారు బ్రెజిల్ అధ్యక్షుడు అతని ఇద్దరు కేబినెట్ మంత్రులు. రోడ్డు పక్కనే నిల్చుని పిజ్జా తిన్నారు. న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ హోటల్ సమీపంలోని ఓ వీధిలో పిజ్జా తినడమంటే తమ నాయకుడి సింప్లిసిటీకు నిదర్శనమని బోల్సొనారో(Bolsonaro)మద్దతుదారులు కామెంట్లు పెడుతున్నారు. న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సమావేశానికి హాజరయ్యేముందు వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలనే నిబంధన ఉంది. 


Also read: Vaccine Protest: ఆస్ట్రేలియాలో వ్యాక్సిన్ వ్యతిరేక ప్రదర్శనలు, 40 మంది అరెస్టు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook