Monkeypox Virus: మొన్న బ్రిటన్..నేడు అమెరికాలో. మంకీపాక్స్ కలకలం తీవ్రమౌతోంది. అమెరికాలోని మసాచుసెట్స్ వైద్య ఆరోగ్య శాఖ స్వయంగా దేశంలో మంకీపాక్స్ కేసుల్ని నిర్ధారించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ తరువాత ఇప్పుడు ప్రపంచాన్ని మంకీపాక్స్ ఆందోళన పీడిస్తోంది. బ్రిటన్ తరువాత ఇప్పుడు మంకీపాక్స్ కేసులు అమెరికాలో వెలుగు చూస్తున్నాయి. అమెరికాలోని మసాచుసెట్స్ వైద్య ఆరోగ్య శాఖ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించింది. అమెరికాలో బుధవారం ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాల్ని ధృవీకరించారు. ఇటీవలే ఈ వ్యక్తి కెనడా పర్యటనకు వెళ్లివచ్చాడు.


యూఎస్‌లో వెలుగుచూసిన మంకీపాక్స్


మసాచుసెట్స్ వైద్య ఆరోగ్యశాక ప్రకారం ఆ వ్యక్తికి జమైకాలో ప్రాధమికంగా పరీక్షలు జరిగాయి. మంకీపాక్స్ వైరస్ నిర్ధారణ మాత్రం యూఎస్‌లోని సీడీసీలో జరిగింది. ఆ వ్యక్తితో కాంటాక్ట్‌లో ఉన్నవారిని గుర్తించేపనిలో పడ్డారు ఇప్పుడు సీడీసీ నిపుణులు. అయితే సామాన్య ప్రజలకు ఈ వైరస్‌తో ఏ విధమైన ప్రమాదం లేదని సీడీసీ వెల్లడించింది. ప్రస్తుతం ఆ వ్యక్తికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.


మంకీపాక్స్ అంటే ఏంటి


మంకీపాక్స్ అనేది సీరియస్ వైరల్ రోగం. ఇది కూడా ఫ్లూ లాంటిదే. లింఫ్ నోడ్స్ వాపుతో ఈ వ్యాధి ప్రారంభమౌతుంది. ఇది ముఖం, శరీరంపై ఓ గింజలా పుట్టి..పెరుగుతుంది. ఇది 2 నుంచి 4 వారాల వరకూ ఉంటుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి అంత సులభంగా వ్యాపించదు. కానీ రోగి శరీరంలోని సెన్సిటివ్ భాగాలు లేదా మంకీపాక్స్ భాగాల నుంచి త్వరగా విస్తరిస్తుంది. 


బ్రిటన్‌లో 9 మంకీపాక్స్ కేసులు


అమెరికన్లలో ఇప్పటివరకూ ఒక్క మంకీపాక్స్ కేసు కూడా గుర్తించలేదు కానీ టెక్సాస్, మేరీల్యాండ్‌‌లో 2021లో నైజీరియా నుంచి వచ్చినవారిలో ఓ వ్యక్తిలో ఈ లక్షణాలు గుర్తించారు. అటు 2022 మే నెలలో బ్రిటన్‌లో మంకీపాక్స్ ప్రారంభమైంది. ఇప్పటి వరకూ ఆ దేశంలో 9 మంకీపాక్స్ కేసులు గుర్తించారు. ఇక్కడ కూడా తొలికేసు నైజీరియా నుంచి వచ్చింది. బ్రిటన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. 


Also read: Russia Ukraine War: ఉక్రెయిన్‌ సైనికుల లొంగుబాటు...రష్యా చేతికి మారియుపోల్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook