పాకిస్తాన్‌కు సంబంధించిన అతిపెద్ద సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయ్యింది. బ్రిటన్‌లో సెటిలైన పాకిస్తానీయులు కొందరు స్థానిక అమ్మాయిలను పెళ్లి చేసుకొని తర్వాత వారిని బలవంతంగా వ్యభిచారం రొంపిలోకి దింపుతున్న ఘటనలు ఈ మధ్యకాలంలో పాకిస్తాన్‌లోని మిర్పూర్ లాంటి చోట్ల ఎక్కువవుతున్నాయి. వివరాల్లోకి వెళితే... తాము బ్రిటన్‌లో సెటిలైన ప్రవాస పాకిస్తానీయులమని చెబుతూ కొన్ని కుటుంబాలు, స్థానిక కుటుంబాలతో సంబంధాలు మాట్లాడుకొని.. అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తర్వాత పెళ్లి జరిగాక, ఆ ముఠాలు దంపతుల తొలిరాత్రి వీడియోలను రికార్డు చేసి.. వాటిని చూపించి అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. తాము చెప్పినట్లు వినకపోతే, ఆ వీడియోలను వారి కుటుంబ సభ్యులందరికీ పంపిస్తామని.. పరువును బజారుకీడుస్తామని బెదిరిస్తూ.. ఆయా అమ్మాయిలను వ్యభిచార వృత్తిలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నాయి.


ఇటీవలే ఈ సెక్స్ రాకెట్ బారిన పడిన అనేక బాధితులు మిర్పూర్‌లోని కాశ్మీర్ ప్రెస్ క్లబ్బులో సమావేశమయ్యారు. తాజా పెహల్వాన్ అలియాస్ ముంతాజ్ అనే ఓ ప్రవాస పాకిస్తానీ ఆధ్వర్యంలో ఈ మాఫియా నడుస్తోందని.. ఇప్పటి వరకు దాదాపు 15 మంది అమ్మాయిలను ఈ ముఠా ట్రాప్ చేసిందని సమాచారం.


అమ్మాయికి పెళ్లి జరిగాక.. వారి తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అవకాశం కల్పించకపోవడతో పాటు హూస్ అరెస్ట్ చేసి.. ఆ తర్వాత వీడియోలు చూపించి బెదిరిస్తూ వ్యభిచార రొంపిలోకి లాగడం అనేది ఈ ముఠా సాధారణంగా వేసే పథకం. బాలికలను విదేశాలకు అక్రమ రవాణా చేయడంతో పాటు వారికి డ్రగ్స్ అలవాటు చేసి బానిసలుగా మార్చడమనేది ఈ ముఠా పని. ప్రస్తుతం బాధితులే బయటకు వచ్చి ఈ మాఫియా గురించి బహిర్గతం చేయడంతో ప్రభుత్వం తగిన దర్యాప్తుకి ఆదేశించింది.