Justin Trudeau Resignation: భారతదేశంపై విషం చిమ్ముతున్న కెనడాలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ప్రధానమంత్రి పదవికి జస్టిన్‌ ట్రుడో రాజీనామా చేశారు. ప్రధాని పదవికే కాకుండా తన సొంత లిబరల్‌ పార్టీ పదవికి కూడా రాజీనామా చేయడం అక్కడి రాజకీయాల్లో కలకలం రేపింది. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్న అనంతరం పదవి నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. అకస్మాత్తుగా అతడు రాజీనామా చేయడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Zoo Park Flyover: రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయం.. జూపార్క్‌ ఫ్లైఓవర్‌కు మన్మోహన్‌ సింగ్‌ పేరు


కెనడా ప్రధానమంత్రిగా.. లిబరల్‌ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం రాత్రి జస్టిన్‌ ట్రూడో ప్రకటించారు. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్న తర్వాత బాధ్యతల నుంచి వైదొలుగుతానని ట్రూడో తెలిపారు. కొన్నాళ్లుగా ట్రూడో ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఉప ప్రధాని, ఆర్థిక శాఖ మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్‌ రాజీనామా చేశారు. దీంతో ట్రూడోపై ఒత్తిడి పెరిగింది. ప్రభుత్వపరంగా.. పార్టీపరంగా తీవ్ర ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు ట్రూడో పదవి నుంచి దిగిపోయాడు.

Also Read: KT Rama Rao: మోసాన్ని కప్పిపుచ్చడానికే ఏసీబీ విచారణ డ్రామా: కేటీఆర్


'లిబరల్‌ పార్టీ నాయకత్వానికి.. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తున్న విషయాన్ని పార్టీకి.. గవర్నర్‌కు తెలిపారు. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్న వెంటనే రాజీనామా చేస్తా. ఈ వ్యవహారం కొనసాగేందుకు మార్చి 24వ తేదీ వరకు పార్లమెంట్‌ను ప్రొరోగ్‌ చేస్తున్నా' అని జస్టిన్‌ ట్రూడో ప్రకటించారు. కెనడా చట్టం ప్రకారం రాజీనామా చేసిన 3 నెలల్లో లేదా 90 రోజుల్లో కొత్త నాయకత్వం ఎన్నిక కావాల్సి ఉంది. కెనడా ప్రధానిగా దాదాపు పదేళ్లు ట్రూడో కొనసాగుతున్నాడు. ఇటీవల అతడి మంత్రివర్గంలో కీలక నాయకురాలిగా ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్‌ రాజీనామా చేసి ట్రూడోపై సంచలన ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి ట్రూడోకు వ్యతిరేక గళం వినిపిస్తోంది. రాజకీయ అనిశ్చిత తీవ్రస్థాయిలో ఏర్పడడంతో ట్రూడో పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది.