లండన్: కరోనాపై యుద్ధానికి బ్రిటన్‌లో ఓ వృద్ధుడి సంకల్పానికి అనూహ్య మద్దతు లభిస్తోంది. బ్రిటన్‌లోని బెడ్‌ఫోర్డ్‌షైర్‌కు చెందిన 99 ఏండ్ల రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ టామ్ మూర్ (99) కరోనా బాధితుల వైద్యం కోసం ఊహించని రీతిలో విరాళాలు సేకరణ చేశారు. దీంతో దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. టామ్ మూర్‌కు రెండేండ్ల క్రితమే కాలు ఎముక విరగడంతో ఊతకర్ర సాయంతో మాత్రమే నడక సాగిస్తున్నారు. కాగా గార్డెన్‌లో 100 సార్లు నడవాలని నిశ్చయించుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also: ఐసోలేషన్ సెంటర్ నుంచి పరారైన ఆరుగురు కరోనా రోగులు


ఏప్రిల్ నెలలోనే 100వ జన్మదినం జరుపుకోనున్న టామ్ మూర్ పుట్టిన రోజు నాటికి 100 రౌండ్లు తిరుగుతానని సవాల్ విసిరారని, నా సవాల్‌కు స్పందించి కరోనా బాధితుల కోసం తోచినంత విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆ విరాళాలను ఎన్‌హెచ్‌ఎస్‌కు అందిస్తానని, ఆయన లక్ష్యానికి పెద్ద ఎత్తున ప్రచారం లభించిందని, టామ్ మూర్ చేస్తున్న పనికి మంత్ర ముగ్ధులై లక్షల మంది విరాళాలు అందజేశారు. ఇప్పటివరకు మూర్‌కు 12 మిలియన్ పౌండ్లు అంటే భారత కరెన్సీలో రూ.100కోట్ల పైనే విరాళాలు సమకూరాయని తెలిపారు. టామ్ మూర్‌కు ప్రమాదం జరిగినప్పుడు ఎన్‌హెచ్‌ఎస్ ఆయనకు ఎంతో సేవ చేసిందని, ఆ సంస్థ చేసిన సేవలకు కృతజ్ఞతగా ఎన్‌హెచ్‌ఎస్‌కు ఏదో విధంగా సహాయపడాలనుకున్నారని మూర్ అల్లుడు కొలిన్ ఇన్‌గ్రామ్ తెలిపారు. మూర్ ఇప్పుడు బ్రిటన్‌లో సెలెబ్రిటీగా మారిపోయారని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..