కరోనా వైరస్ ప్రభావంతో పలకరింపులే మారిపోయాయి. ఇదివరకటిలాగా చేతులు కలుపుకోవడం.. షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం.. ఆత్మీయంగా కౌగిలించుకోవడం..ఇలా  అంతా మారిపోయింది. ఇప్పుడు కొత్త తరహా పలకరింపులు మొదలయ్యాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్.. ఈ పేరు వింటేనే జనం గజ గజా వణికిపోతున్నారు. వైరస్ దెబ్బకు ఇప్పటికే 3 వేల మంది ప్రాణాలు విడిచారు. మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే ఈ వైరస్.. ఓ అంటు వ్యాధిలా రోజు రోజుకు విస్తరిస్తోంది. ఇప్పటికే 27 దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. ప్రపంచవ్యాప్తంగా 80 వేల మంది పాజిటివ్ లక్షణాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 


Read Also:ముద్దులు వద్దు..!!


చేతులు తాకడం ద్వారా , వైరస్ ఉన్న వారు తుమ్మినా, దగ్గినా ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ముఖానికి మాస్క్‌లు ధరిస్తున్నారు. వీలైతే మొత్తంగా తమను తాము పాలథీన్ కవర్లతో కప్పేసుకుంటున్నారు. హెల్మెట్లు ధరిస్తున్నారు. పెంపుడు జంతువులకు ముఖాలకు కూడా మాస్క్‌లు వేస్తున్నారు. 


[[{"fid":"182678","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


అంతే కాదు పలకరింపులు కూడా మారిపోయాయి. చైనాలో  కరోనా ఎఫెక్ట్ కారణంగా చేతులతో పలకరించుకోకుండా కాళ్లతో పలకరించుకునే విధానాన్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.



ఇక్కడ చూడండి.. ఓ అమ్మాయి ఎలా సిగరెట్ తాగుతుందో..!!