సెంచరీ దాటిన కరోనా వైరస్ మృతుల సంఖ్య
ఆసియాలో అగ్రరాజ్యం.. ఆర్ధికంగా బలమైన రాజ్యం .. చైనాను కరోనా వైరస్ గజగజా వణికిస్తోంది. వారం రోజులుగా కమ్యూనిస్టు పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా రోజు రోజుకు చైనాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతోంది.
ఆసియాలో అగ్రరాజ్యం.. ఆర్ధికంగా బలమైన రాజ్యం .. చైనాను కరోనా వైరస్ గజగజా వణికిస్తోంది. వారం రోజులుగా కమ్యూనిస్టు పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా రోజు రోజుకు చైనాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య సెంచరీ దాటేసింది. దీంతో చైనా వాసులు బెంబేలెత్తిపోతున్నారు.
చైనాలోని వుహాన్ పట్టణంలో మొదలైన వైరస్ .. క్రమంగా అన్ని పట్టణాలకు వ్యాపించింది. మరణ మృదంగం మోగిస్తోంది. వుహాన్ లోనే ఇప్పటి వరకు 100 మంది మృతి చెందారు. ఇదే పట్టణంలో దాదాపు 2 వేల 714 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు అధికారికంగా గుర్తించారు. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు చైనా వ్యాప్తంగా దాదాపు 4 వేల 193 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 106 మంది చనిపోయినట్లుగా చైనా ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది.
[[{"fid":"181473","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
ప్రయాణాలపై నిషేధం
చైనాలో కరోనా వైరస్ దెబ్బకు .. అన్ని ప్రయాణాలపై నిషేధం విధించారు. మరోవైపు భారతీయులు చాలా మంది చైనాలో చిక్కుకుపోయి ఉన్నారు. వారు ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతోందననే భయం గుప్పిట్లో బతుకీడుస్తున్నారు. భారతీయులను వెనక్కి రప్పించడానికి భారత విదేశాంగ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యంగా వుహాన్ పట్టణంలో ఉన్న వారిని తిరిగి తీసుకువచ్చేందుకు చైనా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు.
Read Also: షాకింగ్ వీడియో: నడిరోడ్డుపై ల్యాండ్ అయిన విమానం