Alleged Carona virus in hyderabad : హైదరాబాద్‌లో కరోనా వైరస్ కలకలం

చైనాలో అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ తెలంగాణలోనూ కలకలం రేపుతోంది.  ఇప్పటికే స్వైన్‌ఫ్లూ‌తో గడగడలాడుతున్న హైదరాబాద్‌ను గజగజా వణికిస్తోంది.  చైనా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కరోనా వైరస్ ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Last Updated : Jan 27, 2020, 08:53 AM IST
Alleged Carona virus in hyderabad : హైదరాబాద్‌లో కరోనా వైరస్ కలకలం

చైనాలో అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ తెలంగాణలోనూ కలకలం రేపుతోంది. ఇప్పటికే స్వైన్‌ఫ్లూ‌తో గడగడలాడుతున్న హైదరాబాద్‌ను గజగజా వణికిస్తోంది.  చైనా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కరోనా వైరస్ ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐదు రోజుల క్రితం చైనా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఒక యువ వైద్యుడు జలుబు, దగ్గు లక్షణాలతో ఫీవర్‌ ఆసుపత్రిలో చేరాడు. ఆ యువకుడి నుంచి రక్త నమూనాలను సేకరించి పుణెలోని వైరాలజీ ప్రయోగశాలకు పంపించారు. ఐతే  శుక్రవారం అతనికి  కరోనా వైరస్‌ లేదని తేలింది. ఇదే తరహాలో నిన్న మరో నలుగురు రోగులు ఫీవర్‌ ఆసుపత్రిలో చేరారు. వీరిలో ముగ్గురు చైనా, హాంగ్‌కాంగ్‌ దేశాల నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారు.  మరొకరు ఆ ప్రయాణికుల్లో ఒకరి భార్య. ఈ నలుగురినీ  ఫీవర్  ఆసుపత్రిలో చేర్చుకుని ..  వేర్వేరు గదుల్లో ఉంచి వైద్య పర్యవేక్షణలో సునిశితంగా గమనిస్తున్నారు. 

ఒక వ్యక్తి  మాత్రమే జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు కనిపిస్తుండగా.. ఆ వ్యక్తి నుంచి నమూనాలను సేకరించి ప్రత్యేక వాహనంలో  పుణెకు పంపించారు. ఈ నమూనా ఫలితాలు ఇవాళ( సోమవారం) వస్తాయని వైద్యులు తెలిపారు. మిగిలిన ముగ్గురిలో ఇద్దరు భార్యాభర్తలు. వీరి ముగ్గురిలోనూ ముక్కు కారడం తప్ప మరే ఇతర లక్షణాలు లేవు. మీడియాలో కరోనా వైరస్‌ గురించి వస్తున్న కథనాలపై భయాందోళనలకు గురై..  ముందస్తు జాగ్రత్తగా వారంతట వారే స్వచ్ఛందంగా ఆసుపత్రిలో చేరినట్లుగా వైద్యులు చెప్పారు. ఆసుపత్రిలో చేరిన నలుగురిని నిశితంగా పరిశీలిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు.  ప్రస్తుతానికి జలుబుకు సంబంధించిన సాధారణ చికిత్స మాత్రమే అందజేస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

Read Also: కెనడా, అమెరికాను తాకిన కరోనా వైరస్

గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు

పుణె నుంచి సోమవారం వెలువడే ఫలితం ప్రతికూలంగా వచ్చినా.. ఆసుపత్రిలో చేరిన వారి ఆరోగ్య పరిస్థితి ఉన్నట్టుండి విషమించినా.. వారిని  అత్యవసర చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించడానికి అక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. 8 పడకల ఐసీయూను కూడా వైద్యఆరోగ్యశాఖ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..   

Trending News