షాకింగ్ వీడియో: నడిరోడ్డుపై ల్యాండ్ అయిన విమానం

ఇరాన్ లో మరో విమాన ప్రమాదం జరిగింది. ఐతే ఈసారి ప్రయాణికులకు పేద్ద ముప్పు తప్పింది. ఇరాన్ లోని మహ్ షహర్ నగరంలోని విమానాశ్రయం నుంచి బయల్దేరిన  విమానం .. టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కిందకు దిగింది.

Last Updated : Jan 28, 2020, 08:39 AM IST
షాకింగ్ వీడియో: నడిరోడ్డుపై ల్యాండ్ అయిన విమానం

ఇరాన్ లో మరో విమాన ప్రమాదం జరిగింది. ఐతే ఈసారి ప్రయాణికులకు పేద్ద ముప్పు తప్పింది. ఇరాన్ లోని మహ్ షహర్ నగరంలోని విమానాశ్రయం నుంచి బయల్దేరిన  విమానం .. టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కిందకు దిగింది. ఐతే పైలట్ .. దాన్ని తిరిగి విమానాశ్రయానికి తీసుకు వెళ్లే అవకాశం లేకపోవడంతో .. నడి రోడ్డుపై ల్యాండ్ చేశారు.  కానీ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ సమయంలో రోడ్డుపై జనం కూడా తక్కువగా ఉండడంతో పేద్ద ప్రమాదం తప్పింది.

కేస్పియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ..  ఇరాన్ లోని మహ్ షహర్ నుంచి బయల్దేరింది. ఆ సమయంలో సిబ్బందితోపాటు 130 మంది ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు.  విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలెట్ అత్యవసరంగా దాన్ని కిందకు దింపాల్సి వచ్చింది. కానీ తిరిగి రన్ వేకు వెళ్లలేని పరిస్థితి కావడంతో నడి రోడ్డుపై ల్యాండ్ చేసేశారు.

విమానంలో ల్యాండ్ అయ్యేంత వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపిన ప్రయాణీకులు ఒక్కొక్కరుగా విమానం నుంచి కిందకు దిగారు. అత్యవసరం ద్వారాల  గుండా ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. మరోవైపు ఈ విమాన ప్రమాదంపై అధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు. 

 

Trending News