Facebook Name Change Issue: పేరు మార్పుతో ఫేస్‌బుక్‌కు కొత్త చిక్కులు
Meta Company: ఫేస్‌బుక్ మరోసారి చిక్కులో పడింది. కంపెనీ పేరును ఇటీవల మెటాగా మార్చగా.. అదే పేరుతో ఉన్న మరో సంస్థ కోర్టులో కేసు వేసింది.
Facebook Name Change Issue: వరుస వివాదాలతో గత కొంత కాలంగా చిక్కుల్లో ఉన్న ఫేస్‌బుక్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. రీబ్రాండింగ్‌లో భాగంగా కంపెనీ కార్పొరేట్ పేరును 'మెటా'గా (Facebook to Meta) మార్చుకుంది. అయితే ఇప్పుడు ఈ పేరు మార్పుతో ఫేస్‌బుక్ (ప్రస్తుతం మెటా) మరో (Facebook new Issue) కొత్త చిక్కుల్లో పడింది.
తమ పేరును అక్రమంగా వాడుకుందని ఫేస్‌బుక్‌పై కోర్టులో దావా(Case on Facebook) వేసింది ఓ టెక్ కంపెనీ. చికాగో కేంద్రంగా పని చేస్తున్న 'మెటా' అనే టెక్ కంపెనీ వ్యవస్థాపకుడు నేట్ స్క్యూలిక్ ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌పై విమర్శలు గుప్పించారు. ఫేస్‌బుక్ చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదని పేర్కొన్నారు.
కొంత కాలంగా తమ కంపెనీని విక్రయించాలని ఫేస్‌బుక్ నుంచి ఒత్తిడి వస్తున్నట్లు తెలిపారు నేట్. అయితే ఆ ప్రయత్నం విఫలం కావడంతో.. ఫేస్‌బుక్ తమ కంపెనీని దెబ్బతీసేలా.. ఇలా పేరును మార్చుకుందని పేర్కొన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు.
Also read: Afghanistan: అఫ్గానిస్థాన్‌లో ఘోరం.. నలుగురు మహిళల దారుణ హత్య..ప్రకటించిన తాలిబన్లు!
పేరు మార్పు ఇలా..
ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సంస్థ వార్షిక సదస్సులో కంపెనీ పేరును.. మెటాగా మారుస్తున్నట్లు నవంబర్ 28న ప్రకటించారు. సంస్థ ఆధీనంలోని ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సహా ఇతర సేవల పేర్లలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. ఆయా సంస్థలకు మెటా (Facebook new Name Meta) మాతృసంస్థగా మాత్రమే వ్యవహరిస్తుందని వివరించారు.
Also read: Illegal Immigration: కొత్త రకం అక్రమ వలసలు, 60 విమానాల దారి మళ్లింపు
Also read: Drone Attack In Iraq: ఇరాక్ ప్రధానమంత్రి అల్-కధామీపై హత్యాయత్నం.. నివాసంపై డ్రోన్లతో దాడి
పేరు మార్పు వెనక కారణాలు..
గత కొంత కాలంగా ఫేస్‌బుక్ వ్యక్తిగత ప్రయోజనాలు లక్ష్యంగా యూజర్ డేటాను (User data) ట్రాక్ చేస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ కారణంగా అమెరికాతో పాటు పలు దేశాల్లో ఫేస్‌బుక్ న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంది. దీంతో ఫేస్‌బుక్ పేరు తరచుగా వార్తల్లో రావడం యూజర్లపై ప్రభావం చూపిస్తోందని కంపెనీ భావించింది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌కి చెందిన అన్ని కంపెనీలను ఒకే కొత్త కంపెనీ కిందకు (Why Facebook Changed its Name) తీసుకురావాలనే ఉద్దేశంతో కార్పొరేట్ పేరును మెటాగా మార్చింది.
Also read: Mexico accident: కార్లపైకి దూసుకెళ్లిన ట్రక్కు... 19 మంది దుర్మరణం!
Also read: Baby Human Tail: తోకతో పుట్టిన శిశువు...ఆశ్చర్యపోయిన వైద్యులు