Chicken Kills Man: సీన్ రివర్స్.. మనిషినే చంపేసిన కోడి! ఎలానో తెలిస్తే షాక్ అవుతారు
Brahma Chicken Kills Ireland Man. ఓ కోడి తన యజమానిపై దాడి చేసి ఏకంగా చంపేసింది. ఈ షాకింగ్ ఘటన ఐర్లాండ్‌లో చోటుచేసుకుంది.
Brahma Chicken Killed Ireland Man: సాధారణంగా కోళ్లపై మనుషులు దాడి చేస్తారు. కోళ్లు ఇంట్లోకి వచ్చి ధాన్యం తిన్న సమయంలో వాటిని వెళ్లగొట్టేందుకు కర్ర లేదా ఇతర వస్తువులతో దాడి చేస్తారు. తల్లి కోడి అయితే వాటి పిల్లల జోలికి వస్తే.. దాన్ని పెంచే వారిపై కూడా దాడి చేస్తుంది. ఇలా దాడి చేసినపుడు కోడి తన నోరు, కాళ్లతో దాడి చేస్తుంది. అప్పుడు గాయాలు చాలా చిన్నవిగా అవుతాయి. అయితే ఓ కోడి తన యజమానిపై దాడి చేసి ఏకంగా చంపేసింది. ఈ షాకింగ్ ఘటన ఐర్లాండ్‌లో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం... ఐర్లాండ్‌లోని కిల్లాహోర్నియాకు చెందిన జాస్పర్ క్రాస్ (67) ఇద్దరు పిల్లలకు తండ్రి. క్రాస్‌కు ఇద్దరు పిల్లలకు తాతయ్య కూడా. క్రాస్‌కు జంతువులు, పక్షులు అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన తన ఇంటి ఆవరణంలో పెంపుడు జంతువులు అయిన కోళ్లు, కుక్కలు, పిల్లులు లాంటివి పెంచేవాడు. చిన్నపాటి పౌల్ట్రీని కూడా మెయిటైన్ చేసేవారు. వాటి సంరక్షణను క్రాస్ చూసుకునేవారు. క్రాస్ ఇంట్లో బ్రహ్మ కోడి కూడా ఉంది. ఆ బ్రహ్మ కోడి చాలా దూకుడుగా ఉండేది.
ఎప్పట్లానే జాస్పర్ క్రాస్ ఇంటినుంచి బయటికి వెళుతుండగా.. బ్రహ్మ కోడి ఒక్కరిగా దాడి చేసింది. క్రాస్ కాలు వెనక భాగంలో తన కాళ్ల గోర్లతో దాడి చేసింది. దాంతో క్రాస్ కాలికి తీవ్ర రక్తస్రావం అయింది. లీటర్ల కొద్ధి రక్తం పోయింది. అదే సమయంలో క్రాస్‌కు గుండెపోటు రావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని క్రాస్ కుమార్తె వర్జీనియా గినాన్ (33) తెలిపారు. ఈ కోడి గతంలో తన కుమార్తెపై కూడా దాడి చేసిందని ఆమె తెలిపారు.
వర్జీనియా గినాన్.. ఐర్లాండ్‌లోని సౌత్ రోస్‌కామన్‌కు చెందిన ట్రైనీ హెల్త్‌కేర్ అసిస్టెంట్. తాజాగా FOX5NY న్యూస్ యాప్‌లో వర్జీనియా
మాట్లాడుతూ.. పెంపుడు కోడి దాడిలో తన తండ్రి చనిపోయారని తెలిపారు. కోడి ప్రమాదకరమని మీరు అనుకోవద్దని ఆమె కోరారు. 2022 ఏప్రిల్ 28లో ఈ ఘటన జరగగా అసలస్యంగా వెలుగులోకి వచ్చింది. చైనాలోని షాంఘై ప్రాంతానికి చెందిన బ్రహ్మ కోళ్లను మాంసం మరియు గుడ్ల కోసం పంచుకుంటారు. బ్రహ్మ చికెన్ సగటున 10-12 పౌండ్లు ఉంటుంది. అయితే దాడి చేసిన కోడి మాత్రం 18 పౌండ్ల బరువు ఉందట.
Also Read: Divi Vadthya Tattoo : ఆ పార్ట్‌పై కొత్త టాటూ వేసిన లోబో.. బిగ్ బాస్ దివి ఫోటో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.