ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్‌ను నిర్మించే దిశగా పరిశోధనలు చేస్తున్నారు చైనా శాస్త్రవేత్తలు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు కోసం ఒక ప్రత్యేకమైన టీమ్‌ను కూడా తయారుచేస్తున్నారు. జిన్‌జియాంగ్‌ ఉగైర్‌ ప్రాంతంలోని కితారులో ఈ టెలిస్కోప్‌ను నిర్మించాలనే యోచనతో ఉంది చైనా ప్రభుత్వం. ఒకవేళ ఇదే ప్రాజెక్టు గనుక విజయవంతమైతే.. ప్రపంచంలోనే అతి పెద్ద రేడియో టెలిస్కోప్‌ను నిర్మించిన ఘనత చైనాకు దక్కుతుంది.


ప్రస్తుతం చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ (సిఎఎస్‌)కి చెందిన జిన్‌జియాంగ్‌ ఖగోళ పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో ఎందరో శాస్త్రవేత్తలు, పరిశోధక విద్యార్థులు ఈ ప్రాజెక్టు మీద పని చేస్తున్నారు. అంతరిక్షాన్ని పూర్తిగా స్కాన్ చేయగల శక్తి ఈ టెలిస్కోప్‌కు ఉంటుందని.. ముఖ్యంగా కృష్ణ బిలాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడానికి కూడా ఈ టెలిస్కోప్ అవసరమవుతుందని అంటున్నారు.