Xi Jinping: డ్రాగన్ దేశమైన చైనాలో సరికొత్త పరిణామం చోటుచేసుకోనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చారిత్మాత్మక తీర్మానం ఆమోదం పొందనుంది. మరోసారి చైనాలో ఆ అధికారం దక్కనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చైనాలో కీలక పరిణామం జరగనుంది. వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని తీర్మానాన్ని ఆమోదించేందుకు చైనాలోని అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(Communist party of China) సిద్ధమైంది. జీ జిన్‌పింగ్‌ను వరుసగా మూడవసారి అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారని తెలుస్తోంది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా 19వ సెంట్రల్‌ కమిటీ ఆరవ ప్లీనరీ సమావేశం నిన్న అంటే నవంబర్ 8న చైనా రాజధాని బీజింగ్‌లో ప్రారంభమైంది. నాలుగు రోజులపాటు జరగనునున్న ఈ సమావేశంలో తొలిరోజు 400 మంది చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. సీపీసీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ప్రభుత్వ పనితీరుపై ఒక నివేదికను సమర్పించారు.


వందేళ్లలో కమ్యూనిస్టు పార్టీ సాధించిన విజయాలను వివరిస్తూ పొలిటికల్‌ బ్యూరో తరపున ఒక ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. చైనా నూతన అధ్యక్షుడిని( China New President) 2022లో ఎన్నుకోవాల్సి ఉంది. అందుకే సీపీసీ ప్లీనరీ నిర్వహిస్తున్నారు. పార్టీ వందేళ్ల చరిత్రను, జయాపజయాలను సమీక్షించుకునేందుకు, భవిష్యత్తు నాయకత్వానికి బాటలు వేయడానికి ప్లీనరీ జరుగుతున్నట్లు తెలిసింది. 


చైనాలో మూడు ముఖ్యమైన అధికార కేంద్రాలు 68 ఏళ్ల జిన్‌పింగ్‌ (Xi Jinping)ఆధీనంలోనే ఉన్నాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, శక్తివంతమైన సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ చైర్మన్‌గా, చైనా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అధ్యక్షుడిగా ఐదేళ్ల పదవీ కాలం వచ్చే ఏడాది ముగియనుంది. ఆయన ఇప్పటికే వరుసగా రెండుసార్లు అధ్యక్ష పీఠం దక్కించుకున్నారు. గత తొమ్మిదేళ్ల పాలనలో మావో జెడాంగ్‌ తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు. అధ్యక్షుడిగా వరుసగా మూడవసారి కొనసాగనున్నట్లు తెలుస్తోంది. జిన్‌పింగ్‌ తన జీవితకాలం అదే పదవిని అంటిపెట్టుకొని ఉండే అవకాశాలు కూడా లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.


Also read: AP HIGH COURT: జ్యుడీషియల్ ప్రివ్యూలో తప్పేముందని ప్రశ్నించిన హైకోర్టు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook