China Covid-19: చైనాలో కరోనా కల్లోలం... ఒక్కరోజే 10వేలకు పైగా కొత్త కేసులు.. లాక్ డౌన్ లోకి ప్రధాన నగరాలు..
China Covid-19: డ్రాగన్ కంట్రీ చైనాలో కరోనా కోరలు చాస్తోంది. నిన్న ఒక్కరోజే పదివేలకు పైగా కేసులు వెలుగు చూశాయి. ఈనేపథ్యంలో చాలా నగరాల్లో లాక్ డౌన్ విధించారు అక్కడి అధికారులు.
China Coronavirus Cases: చైనాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే ఆ దేశంలో 10,729 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే వీరిలో చాలా మందికి కరోనా లక్షణాలు లేకపోయినప్పటికి పాజిటివ్ గా తేలినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం షీ జిన్ పింగ్ ప్రభుత్వం కరోనా కట్టడికి జీరో కొవిడ్ పాలసీని అమలు చేస్తోంది. అయినప్పటికీ కొవిడ్ కేసులు అదుపులోకి రావడం లేదు.
వైరస్ ఉద్ధృతి పెరగడంతో క్యాపిటల్ సిటీ బీజిగ్ లోని పార్కులను మూసివేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా మరోసారి కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. గ్వాంగ్‌జౌ మరియు పశ్చిమ మెగాసిటీ చాంగ్‌కింగ్‌లో శుక్రవారం 5 మిలియన్లకు పైగా ప్రజలు లాక్‌డౌన్‌లోకి వెళ్లారు. బీజింగ్‌లోని 21 మిలియన్ల మంది శుక్రవారం కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడంతో..మరో 118 కొత్త కేసులు నమోదయ్యాయి.
అనేక నగర పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులకు మారాయి, ఆసుపత్రులు అత్యవసర సేవలను పరిమితం చేశారు. దుకాణాలు, రెస్టారెంట్ల మూతపడ్డాయి. అందులో పనిచేస్తున్న సిబ్బందిని క్వారంటైన్ కు తరలించారు. కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు తట్టుకోలేని ప్రజలు... పోలీసులు, వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. జీరో కొవిడ్ పాలసీ కారణంగా చాలా మంది ఇళ్లకే పరిమితం కావడంతో డ్రాగన్ కంట్రీ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ఆంక్షలకు వ్యతిరేకంగా ప్రజల్లో వ్యక్తమవుతున్న నిరాశపై స్పందించిన చైనా నాయకులు.. కేసులు భారీగా ఉన్న నగరాలు తప్ప మిగతా సిటీస్ లో ఉన్నవారిని నిర్భంధం నుంచి విడిచిపెడతామని వారు హామీ ఇచ్చారు.
Also Read: Meta Fired 11000 employees: మెటాలో 11 వేల మంది ఉద్యోగుల తొలగింపుపై మార్క్ జుకర్‌బర్గ్ స్పందన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook