China Next Target Russia: న్యూఢిల్లీ :  చైనా (china) భూ దాహానికి అంతులేకుండా పోతోంది. కరోనా వైరస్‌ (Coronavirus) ను మొత్తం ప్రపంచానికి వ్యాప్తిచేసిందన్న నిందల తరువాత చైనా అనేక దేశాలతో సంబంధాలను తెంచుకుంటూ ఘర్షణలకు దిగుతూ వస్తోంది. ఇటీవల భారతదేశం (india-china), మయన్మార్, జపాన్ తరువాత, చైనా ఇప్పుడు రష్యా (russia)కు వ్యతిరేకంగా కయ్యానికి కాలుదువ్వుతోంది. Also read: India vs China: భారత్, చైనా వివాదంలో జోక్యం చేసుకోలేమన్న రష్యా


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇన్నాళ్లు మౌనం వహించిన రష్యా..
రష్యాలో కోవిడ్19 విజృంభిస్తున్నప్పటికీ.. కరోనా పాపం చైనాదే అంటూ మొత్తం ప్రపంచం ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ చైనాపై రష్యా ఎలాంటి ఆరోపణలు చేయలేదు. హాంకాంగ్ సమస్యపై కూడా రష్యా మౌనం వహించింది. కానీ చైనా రష్యాకు ఎలాంటి షాక్ ఇచ్చిందంటే.. రష్యాలోని ఒక ప్రధాన నగరం తమదేనంటూ చైనా తన వాదనను తెరపైకి తీసుకొచ్చింది. Also read: 
డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు


1860లో రష్యా-చైనా మధ్య సంధి..
రష్యా నగరమైన వ్లాదివాస్టోక్
( Vladivostok)పై చైనా ఇప్పుడు కన్నేసింది. ఈ నగరం ఒకప్పుడు కింగ్ రాజవంశానికి (Qing dynasty) సంబంధించినది. రెండవ నల్లమందు యుద్ధంలో రష్యా.. చైనాను ఓడించిన తరువాత... చైనా వ్లాదివాస్టోక్ ఈ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాల్సి వచ్చింది. ఇందుకోసం 1860లో ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కూడా కుదిరింది. అప్పటి నుంచి ఈ నగరం రష్యా ఆధీనంలోనే ఉంది. అయితే.. చైనా ఆ సంధిని ఇప్పుడు అంగీకరించడానికి నిరాకరించింది.


సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా రాజుకున్న వివాదం..
అయితే.. ఈ నగరాన్ని ఇంతకుముందు హాచెనవై అని పిలిచేవారని, ఏకపక్ష ఒప్పందంతో రష్యా దీనిని ఆక్రమించుకుని 160ఏళ్లుగా ఆధీనంలో ఉంచుకుందని చైనా రష్యాకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించింది. వాస్తవానికి ఈ వివాదం సోషల్ మీడియా పోస్ట్‌ ద్వారా రాజుకుంది. వ్లాదివాస్టోక్ నగరం గురించి చైనాలోని రష్యన్ రాయబార కార్యాలయం చైనా మైక్రోబ్లాగింగ్ సైట్ వీబో ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేసింది. దీని ఉద్దేశం వ్లాదివాస్టోక్ నగరం 160వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం గురించి. ఆ ప్రకటన వచ్చిరాగానే చైనా దానిని జీర్ణించుకోలేకపోయింది. Also read: 
PM Modi`s Ladakh visit: ప్రధాని లఢక్ పర్యటనపై స్పందించిన చైనా


రష్యా వాణిజ్య కార్యకలాపాలపై దెబ్బకొట్టేందుకేనా..?
చైనాకు ఫిలిప్పీన్స్, మలేషియా, ఇండోనేషియాతో కూడా వివాదాలు ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రపు సరిహద్దున రష్యాలోని వ్లాదివాస్టోక్ నగరం నౌకదళానికి ప్రధాన స్థావరంగా ఉంది. ఈ నగరం ప్రిమోర్స్కీ క్రై రాష్ట్రానికి రాజధాని. చైనా, ఉత్తర కొరియా సరిహద్దుకు సమీపంలో ఈ నగరం ఉంది. వాణిజ్యపరంగా, చారిత్రాత్మకంగా రష్యాలో వ్లాదివాస్టోక్ చాలా ముఖ్యమైన నగరం. రష్యా నుంచి ఎగుమతి అయ్యే వాణిజ్యంలో ఎక్కువ భాగం ఈ ఓడరేవు ద్వారానే వెళుతుంది. అందుకే చైనా ఇప్పుడు దీనిపై కన్నేసిందని పేర్కొంటున్నారు. 
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..