China Likely Impose Lockdown In Xian: చైనాలో మరోసారి పలు నగరాల్లో లాక్‌డౌన్ విధించేందుకు రంగం సిద్ధమవుతోంది. చైనాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ఫ్లూ కేసులు మాత్రం వేగంగా పెరుగుతుండడంతో ఆందోళన నెలకొంది. దీంతో చైనా అధికారులు కొన్ని నగరాల్లో లాక్‌డౌన్ విధించాలని యోచిస్తున్నారు. అయితే లాక్‌డౌన్ నిర్ణయంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి కోవిడ్‌ కాలంలో పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చైనాలో జియాన్‌ నగరంలో లాక్‌డౌన్‌కు సంబంధించి అత్యవసర రెస్పాన్స్ ప్రణాళిక జారీ చేశారు అధికారులు. నగరంలో సోకిన ప్రాంతాలను మూసివేయవచ్చని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ను తగ్గించేందుకు ఆదేశాలు కూడా జారీ చేయనున్నారు. ఉత్పత్తి, వ్యాపార కార్యకలాపాలు కూడా నిలిపివేస్తారు. షాపింగ్ మాల్స్, థియేటర్లు, లైబ్రరీలు, పర్యాటక ప్రదేశాలు, ఇతర రద్దీ ప్రదేశాలు కూడా మూసివేయనున్నారు.


ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్ ప్రకారం.. పాఠశాలలు, నర్సరీలు అన్ని స్థాయిలలో  బంద్ కానునున్నాయి. జియాన్‌లో దాదాపు 13 మిలియన్ల జనాభా ఉంది. ఈ నగరం ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. లాక్‌డౌన్‌కు సంబంధించి ప్రజలు సోషల్ మీడియాలో నగర పాలక సంస్థపై విమర్శలు చేస్తున్నారు. లాక్‌డౌన్ విధించే బదులు ప్రజలకు టీకాలు వేయండంటూ కోరుతున్నారు. లాక్‌డౌన్ వార్తలతో ప్రజలు ఎలా భయాందోళన చెందుతున్నారని అంటున్నారు.


జాతీయ స్థాయిలో స్పష్టమైన ఆదేశాలు లేకుండా.. పని, వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని జియాన్ అధికారులు ఓ తీర్మానాన్ని జారీ చేయాలని యోచిస్తున్నారు. చైనాలో ఫ్లూ కేసుల పెరుగుదలతో పాటు కొన్ని ఫార్మసీలలో మందుల కొరత కూడా ఉన్నట్లు తెలుస్తోంది.  


కరోనా మహమ్మారి సమయంలో చైనా ప్రపంచంలోని అత్యంత కఠినమైన ఆంక్షలు అమలు చేసిన విషయం తెలిసిందే. కొన్ని నగరాల్లో నెలల తరబడి లాక్‌డౌన్‌ను కొసాగించారు. జియాన్ నగరంలో కూడా కఠినమైన లాక్‌డౌన్‌ను అమలు చేశారు. ఈ సమయంలో చాలా మందికి ఆహారం, ఇతర నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడింది. అలాగే వైద్యసేవలు కూడా దెబ్బతిన్నాయి. మరోసారి లాక్‌డౌన్ నేపథ్యంలో జియోన్ నగర ప్రజలు అధికారులపై మండిపడుతున్నారు.


Also Read: India Vs Australia: అహ్మదాబాద్ టెస్టులో భారత్ జోరు.. ఆసీస్‌కు దీటుగా..  


Also Read: Shubman Gill: శుభ్‌మన్ గిల్ సెంచరీ.. కేఎల్ రాహుల్ సర్దుకోవాల్సిందేనా..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook