China Plane Crash: బ్రేకింగ్ న్యూస్.. చైనా ఘోర విమాన ప్రమాదం.. 133 మంది ప్రయాణికులు మృతి?
China Plane Crash: చైనాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. గ్వాంగ్ జౌ నుంచి కున్ మింగ్ కు 133 మంది ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్ 737 విమానం మార్గమధ్యంలో ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
China Plane Crash: చైనా దేశంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కూలిపోయింది. 133 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోయింగ్ 737 గ్వాంగ్ జౌ ప్రావిన్స్‌లోని వుజౌ, టెంగ్ కౌంటీలో కూలిపోయింది. విమానం కూలిన వెంటనే అందులో నుంచి మంటలు ఏర్పడ్డాయి.
సమాచారం తెలుసుకున్న అధికారులు వెంటనే విమానం కూలిన ప్రదేశానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. అయితే ఈ ప్రమాదంలో ఎంత మంది మరణించారు? ఎంత మంది గాయపడ్డారు? అసలు విమానం కూలడానికి వెనకున్న కారణమేంటో తెలియాల్సి ఉంది.
MU5736 విమానం గ్వాంగ్‌జౌలో మధ్యాహ్నం 1 గంటకు బయల్దేరగా.. అది మధ్యాహ్నం 3.05 గంటలకు కున్ మింగ్ కు చేరాల్సి ఉంది. అయితే మార్గమధ్యంలో విమానం కూలిపోయింది.
Also Read: Taliban Effect: ఆర్ధిక పరిస్థితులతో డ్రైవర్‌గా మారిన ఆర్ధిక మంత్రి, ఎక్కడ, ఏం జరిగింది
Also Read: Imran Khan on India: భారత్‌పై..ఎన్డీయే ప్రభుత్వ విధానాలపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook